AI- యూనానిమస్ గా సెలెక్ట్ చేసింది ఆ జట్టునే
IPL 2025 final: ఐపీఎల్ 2025లో బిగ్ డే.. నేడే ఫైనల్స్. ఐపీఎల్ లో ఓ కొత్త ఛాంపియన్ ఆవిర్భవించబోయేదీ నేడే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢీ కొట్టబోతోంది పంజాబ్ కింగ్స్. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదిక.
ఏ జట్టు గెలిచినా.. తొలిసారి కప్ ను ముద్దాడుతుంది. ఈ రెండింట్లో ఏ జట్టు కూడా ఇప్పటివరకు ఐపీఎల్ కప్ కొట్టలేదు. 2022 తరువాత మళ్లీ అలాంటి సీన్.. ఈ రాత్రికి రిపీట్ కాబోతోంది. ఆ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఓ కొత్త విజేతను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేయబోతోంది 18వ ఐపీఎల్ సీజన్.

ఇప్పటివరకు అత్యధికసార్లు ఐపీఎల్ ఛాంపియన్లుగా నిలిచిన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే. అయిదేసిసార్లు చొప్పున కప్ గెలిచాయి. ఈ రెండింటికే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్స్ అనే పేరు ఉంది. ఈ సారి ఈ రెండూ కూడా ఫైనల్స్ చేరలేకపోయాయి. చెన్నై సూపర్ కింగ్స్.. లీగ్స్ దశలోనే ఇంటిముఖం పట్టగా.. ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ లో ఓడిపోయింది.
ఈ రెండింటి తరువాత కోల్ కత నైట్ రైడర్స్ మూడుసార్లు విజేతగా నిలిచింది. రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, దక్కన్ ఛార్జర్స్ ఒక్కోసారి కప్ అందుకున్నాయి. నేడు- రాయల్ ఛాలెంజర్స్ లేదా పంజాబ్ కింగ్స్.. ఈ జాబితాలో చేరనున్నాయి.
కాగా- ఐపీఎల్ 2025 ఫైనల్ పై ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఏకగ్రీవంగా ఆర్సీబీ వైపే మొగ్గు చూపాయి. ఎక్స్ కు చెందిన గ్రోక్ గానీ, ఛాట్ జీపీటీ గానీ, జెమిని ఏఐ గానీ యునానిమస్ గా ఆర్సీబీదే గెలుపని స్పష్టం చేశాయి. సాంకేతికంగా ఆ జట్టు గెలవడానికి గల అవకాశాలను అవి విశ్లేషించాయి.
క్వాలిఫయర్ 1 రిజల్ట్ తో పాటు లీగ్ దశలో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ఆడిన మ్యాచ్ లను గ్రోక్ ఎనలైజ్ చేసిన అనంతరం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. పంజాబ్ తో పోల్చుకుంటే ఆర్సీబీ అన్ని రంగాల్లోనూ బలంగా ఉందని, దానికి నిదర్శనమే క్వాలిఫయర్ 1 విజయమని గుర్తు చేసింది. 11 మ్యాచ్ లల్లో 21 వికెట్లు తీసిన హేజిల్ వుడ్ జట్టుకు అందుబాటులోకి రావడం ప్లస్ పాయింట్ గా పేర్కొంది.
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆ జట్టుకు ప్రధాన బలమని వివరించింది గ్రోక్. 55.81 బ్యాటింగ్ యావరేజ్ తో కోహ్లీ ఇప్పటివరకు 614 పరుగులు చేయడాన్ని ప్రస్తావించింది. అలాగే- స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉన్న డాషింగ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్.. అదే దూకుడుతో ఆడొచ్చని అంచనా వేసింది. పంజాబ్ తో పోల్చుకుంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విషయంలో ఆర్సీబీ ఒకింత మెరుగ్గా ఉందని తెలిపింది.
దాదాపుగా ఇదే విషయాన్ని వెల్లడించింది జెమిని ఏఐ కూడా. ఆర్సీబీ, పంజాబ్ మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందని పేర్కొంది. దూకుడుగా వైఖరి వల్ల ఆర్సీబీ మ్యాచ్ మొత్తం పైనా డామినేట్ చేయగలదని పేర్కొంది. నిలకడగా రాణిస్తోండటం ఆర్సీబీ ప్రధాన బలమని, ఫైనల్ లో కూడా ఆ జట్టు అలాగే ఆడుతుందని అభిప్రాయపడింది.
ఛాట్ జీపీటీ కూడా ఆర్సీబీ వైపే మొగ్గు చూపింది. క్వాలిఫయర్ 2లో శ్రేయాస్ అయ్యర్ భారీ స్కోర్ చేయడం, 203 పరుగులను ఆ జట్టు అందుకున్న నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని సూచించింది. పంజాబ్.. ఆర్సీబీకి గట్టి సవాల్ విసురుతుందని పేర్కొంది.












Click it and Unblock the Notifications