IND VS AUS: రోహిత్, విరాట్ అలా కోరుకోరు - అంబటి రాయుడు లెక్కే వేరు..!!
ప్రపంచ కప్ లో విజేత ఎవరు. మరి కొద్ది గంటల్లో జరిగే తుది సమరం పైన కోట్లాది మంది ఫ్యాన్స్ ఉత్కంఠగా నిరీక్షిస్తున్నారు. టీమిండియా పైన భారీ అంచనాలే ఉన్నా..ప్రత్యర్ధి టీం ఆసీస్ ను ఏ ఒక్కరూ తక్కువగా అంచనా వేయటం లేదు. రోహిత్ టీం ప్రపంచ కప్ లో రాణిస్తున్న తీరుతో కప్ ఖచ్చితంగా గెలుస్తారని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో సీఎస్కే మాజీ ప్లేయర్ అంబటి రాయుడు ఫైనల్స్ లో రెండు టీంల సామర్ధ్యం పైన ఆసక్తికర విశ్లేషణ చేసారు.
ఉత్కంఠ పోరు: రెండు హేమా హేమీ జట్ల మధ్య ప్రపంచ కప్ తుది సమరం జరగుతోంది. కోట్లాది మంది ఫ్యాన్స్ టీమిండియా విశ్వ విజేత గా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు. తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడినా ఆసీస్ తన సత్తా ఏంటో నిరూపించుకుంది. ఈ సమయంలో ఆసీస్ ఇప్పటికే మైండ్ గేమ్ మొదలు పెట్టింది. టీమిండియా రియల్ గేమ్ పైన ఫోకస్ చేసింది.

ఈ మ్యాచ్ లో టాస్..టీం కూర్పు..పిచ్ కండీషన్లు..ఆటలో వ్యూహాలు గెలుపు లో కీలకం కానున్నాయి. అహ్మదాబాద్ గ్రౌండ్స్ లో ఈ హైఓల్టేజ్ మ్యాచ్ వీక్షణ కోసం లక్షకు పైగా అభిమానులు తరలి వస్తున్నారు. ప్రముఖులు హాజరవుతున్నారు. టీమిండియా కు కెప్టెన్ రోహిత్ శుభారంభం ఇస్తే భారీ స్కోరు ఖాయంగా కనిపిస్తోంది. ఇక, ముగ్గురు బౌలర్ల పైన ఆశలు భారీగా ఉన్నాయి. ఇక, టీం ఇండియా పైన భారీగా ఒత్తిడి నెలకొంది.
టీం ఇండియాకే ఛాన్స్: ఇక, ఈ మ్యాచ్ పైన అంబటి రాయుడు ఆసక్తి కర విశ్లేషణ చేసారు. ఆసీస్ బలమైన టీం అయినా.. సొంత గడ్డ పైన ఆడటం భారత్ కు కలిసొచ్చే అంశంగా పేర్కొన్నారు. ఆసీస్ లో కూడా ఐపీఎల్ లో ఆడిన ప్లేయర్లు ఉండటంతో వారికి భారత్ పిచ్ లు కొత్త కాదని విశ్లేషించారు. టీమిండియాలొ మొత్తం ప్లేయర్లు ఫాంలో ఉండటం..సమిష్టిగా రాణించటం కలిసొచ్చే అంశంగా వివరించారు.
రోహిత్ తో పాటుగా బ్యాటర్లు ఇప్పటి వరకు రాణిస్తున్న తరహాలోనే కొనసాగితే గెలవటం కష్టం కాదన్నారు. అసలు రెండు మంచి జట్లు తల పడుతున్న సమయంలో టాస్ ఏ మాత్రం కీలకంగా భావించటం లేదన్నారు. పిచ్ కండీషన్ల మేరకే తుది జట్టు ఎంపిక ఉంటుందని..ఎవరిని ఎంపిక చేసారనే దాని కంటే తమ బాధ్యతలు ఎవరు సక్రమంగా నిర్వహించారనేదే గెలుపులో కీలకంగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు.
అందరూ విన్నింగ్ ప్లేయర్స్: చాలా మంది ఈ మ్యాచ్ ద్వారా ఆసీస్ పైన భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారని..కానీ, రోహిత్ - విరాట్ లాంటి ఆటగాళ్లు పూర్తిగా క్రీడీ స్పూర్తిని ప్రదర్శిస్తారని అంబటి రాయుడు వ్యాఖ్యానించారు. ఆటలో ప్రతీకారం ఉండదని..రెండు జట్లు గెలవాలని మాత్రమే ఆడతాయని విశ్లేషించారు. ఈ మ్యాచ్ లో భారత్ కే విజయావకాశాలే ఉంటాయని చెప్పారు.
సెమీస్ లో భారీ స్కోరు చేసినా.. న్యూజీలాండ్ బ్యాటర్ల తో ఎదురైన అనుభవం టీమిండియాను మరింత షైన్ చేసేందుకు మేలు జరుగుతుందన్నారు. ఆసీస్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టకుండా..టీం గా ఇండియా ప్లేయర్లు ముందుకు వెళ్తే..గెలుపు కష్టం కాదన్నారు. ఒన్ టు లెవన్ టీం ఇండియాలో అందరూ మ్యాచ్ విన్నర్స్ గా అంబటి పేర్కొన్నారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications