ఆర్సీబీ కేప్టెన్ కు చుక్కలు చూపిన సిమ్ కార్డ్..!!

ఏ మాత్రం ఊహించని విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేప్టెన్ రజత్ పటిదార్.. చిక్కుల్లో చిక్కుకున్నాడు. తన ప్రమేయం లేకుండానే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనాల్సి వచ్చింది. అన్ వాంటెడ్ ఫోన్ కాల్స్ ను స్వీకరించాల్సి వచ్చింది. ఫలితంగా పోలీసులను ఆశ్రయించాడు.

దీనికి కారణం- ఓ మొబైల్ సిమ్ కార్డ్. గతంలో చాలాకాలం పాటు వినియోగించిన తన మొబైల్ నంబర్ ను ఈ మధ్య ఇన్ యాక్టివ్ చేశాడు రజత్ పటిదార్. కొత్త సిమ్ ను కొన్నాడు. ప్రస్తుతం ఆ నంబరే అతని వద్ద యాక్టివ్ గా ఉంటోంది. మూడు నెలలుగా పాత సిమ్ నంబర్ ఇన్ యాక్టివ్ లో పెట్టాడు.

An old Phone number troubled to Rajat Patidar

ఈ నంబర్ ను.. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ రిలయన్స్ జియో. ఛత్తీస్ గఢ్ కు చెందిన ఓ యువకుడికి విక్రయించిందా సంస్థ. అతని పేరు మనీష్. గరియాబాంద్ అతని స్వస్థలం. ఇటీవలే రిలయన్స్ జియో సిమ్ ను కొనుగోలు చేయగా.. అతనికి రజత్ పటిదార్ పాత మొబైల్ నంబర్ దక్కింది.

ఈ నంబర్ ను యాక్టివ్ చేయగానే.. మనీష్, అతని స్నేహితుడు ఖేమరాజ్ ఆ నంబర్ మీద రిజిస్టర్ అయివున్న వాట్సాప్ ప్రొఫైల్ చూడగా.. రజత్ పటిదార్ ఫొటో కనిపించింది. ఆ తర్వాత.. నంబర్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ విరాట్ కోహ్లీ, మాజీ లెజెండ్ ఏబీ డివిలియర్స్ వంటి క్రికెటర్ల నుండి కాల్స్ రావడం మొదలయ్యాయి.

అది రజత్ పటిదార్ నంబరే అనుకుని వాళ్లందరూ కూడా మనీష్ కు ఫోన్ చేయడం మొదలుపెట్టారు. ఈ ఫోన్ కాల్స్ ను మనీష్, అతని ఫ్రెండ్ ఖేమ్ రాజ్ తొలుత నమ్మలేకపోయారు. ప్రాంక్ కాల్స్ అయి ఉండొచ్చని భావించారు. దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎవరు ఫోన్ చేసినా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

విరాట్ కోహ్లీని మాట్లాడుతున్నానంటూ చెప్పగా.. వాళ్లు నవ్వుకుంటూ నేను ఎంఎస్ ధోనీని మాట్లాడుతున్నానంటూ మనీష్ బదులిచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత రజత్ పటిదార్ స్వయంగా మనీష్‌ కు ఫోన్ చేశాడు. అది తన పాత నంబర్‌ అని, తిరిగి ఇవ్వాలని కోరాడు.

కోచ్‌, తోటి క్రికెటర్లు, వ్యక్తిగత పరిచయాలకు ఆ నంబర్ ఒక్కటే ఆధారమని వివరించాడు. అయినప్పటికీ వాళ్లు నమ్మలేదు. దీంతో పటిదార్ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. పటిదార్ నుంచి ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు గరియాబంద్ కు వెళ్లారు. మనీష్ ను కలిశారు. పరిస్థితి తీవ్రతను వివరించారు. సిమ్ కార్డ్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ గందరగోళం వల్ల తమ కల నెరవేరిందని మనీష్, ఖేమ్ రాజ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లతో మాట్లాడే ఛాన్స్ దక్కిందని ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ నంబర్ తమకు దక్కకపోయివుంటే కోహ్లీ, డివిలియర్స్ వంటి క్రికెటర్లతో మాట్లాడే అవకాశం వచ్చేదే కాదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+