డ్రీమ్ స్టార్ట్: వన్డేల్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ అరంగేట్రం

యువ ఫాస్ట్ పేసర్ ఆన్షుల్ కాంబోజ్ వన్డే ఇంటర్నేషనల్స్ లో అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్‌తో ముల్లాన్‌పూర్‌ వేదికగా మూడో వన్డే మ్యాచ్‌లో అతనికి తుది జట్టులోకి చోటు దక్కింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా కాంబోజ్ తన తొలి వన్డే క్యాప్‌ను అందుకున్నాడు. మూడు మ్యాచ్ ల ఈ వన్డే సిరీస్‌ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకోవడంతో టీమ్ మేనేజ్‌మెంట్‌ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది.

గాయపడిన యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో ఆన్షుల్ కాంబోజ్ ఊహించని విధంగా వన్డే జట్టులోకి వచ్చాడు. అంతకుముందు పుదుచ్చేరిలో ఆస్ట్రేలియా ఏ తో జరిగిన టెస్ట్ లో ఆడుతున్న ఈ కుడిచేతి వాటం బౌలర్‌ను హుటాహుటిన ముల్లాన్ పూర్ కు పిలిపించుకుంది బీసీసీఐ. తుది జట్టులోకి తీసుకుంది. ఇటీవలి మ్యాచ్‌లలో లైన్ అండ్ లెంగ్త్‌తో వరుస వికెట్లు తీస్తూ సెలెక్టర్ల కంట్లో పడ్డాడు అన్షుల్ కాంబోజ్. దీంతో అతనికి ఈ అవకాశం లభించింది.

Anshul Kamboj has made his India ODI debut against West Indies in the third match series Mullanpur

వెస్టిండీస్‌తో జరుగుతున్న ఈ వన్డే సిరీస్‌లో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన మూడో కొత్త ఆటగాడిగా కాంబోజ్ నిలిచాడు. అంతకుముందు అకిబ్ నబీ, నమన్ ధీర్ కూడా ఇదే సిరీస్ ద్వారానే భారత్ తరఫున అరంగేట్రం చేశారు. కాంబోజ్‌కు ఇది రెండో అంతర్జాతీయ మ్యాచ్. గత ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగిన ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ద్వారా టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు వన్డే ఫార్మట్ లో అడుగు పెట్టాడు.

హుటాహుటిన పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచిన నయారా
హుటాహుటిన పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచిన నయారా

తిరువనంతపురం, గువాహటి వన్డేలలో ఘన విజయాలు సాధించిన భారత జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇప్పటికే 2-0 తేడాతో సొంతం చేసుకుంది. ఈ క్రమంలో నామమాత్రమైన చివరి వన్డే మ్యాచ్‌లో ప్రయోగాల వైపు అడుగులు వేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్, జట్టులో కీలక మార్పులతో బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్ కోసం ఆన్షుల్ కాంబోజ్‌తో పాటు అనుభవజ్ఞుడైన మహ్మద్ సిరాజ్, ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని కూడా తుది జట్టులోకి తీసుకున్నారు.

చర్లపల్లి నుంచి అరుణాచలానికి ప్రత్యేక రైళ్లు.. ఏపీలో హాల్ట్ స్టేషన్లు
చర్లపల్లి నుంచి అరుణాచలానికి ప్రత్యేక రైళ్లు.. ఏపీలో హాల్ట్ స్టేషన్లు

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడు ఆన్షుల్ కాంబోజ్. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తోన్నాడు. 2022 విజయ్ హజారే ట్రోఫీలో బీహార్‌పై జరిగిన వన్డే మ్యాచ్‌తో అతను లిస్ట్-ఏ కెరీర్‌ను ప్రారంభించాడు. ఇప్పటివరకు 35 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు. 22.41 యావరేజ్ తో 56 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ రేట్ 4.58. ఇటీవలే డంబుల్లాలో అఫ్గానిస్తాన్ ఏ తో జరిగిన మ్యాచ్‌లో కూడా సత్తా చాటాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+