సచిన్ టెండూల్కర్ కొడుకు నిశ్చితార్థం.. సైలెంట్ గా కానిచ్చేశారు..!

క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. తాజాగా సచిన్ వారసుడు అర్జున్ టెండూల్కర్(25) నిశ్చితార్థం పూర్తయినట్లు సమాచారం. త్వరలో ఆయన పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ముంబైకు చెందిన వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా ఛందోక్ తో ఆగస్టు 13న అర్జున్ టెండూల్కర్ ఎంగేజ్ మెంట్ పూర్తయినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ఈ వేడుక సైలెంట్ గా ఇరు కుటుంబాల మధ్యలో జరిగిపోయినట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు ఇరు కుటుంబాల నుంచి అతికొద్ది మంది సన్నిహితులు హాజరైనట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై సచిన్ ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

వ్యాపారవేత్త రవి ఘాయ్ కుటుంబానికి ముంబైలో మంచి పేరుంది. వీరికి ఇంటర్ కాంటినెంటల్ మెరైన్ డ్రైవ్ హోటల్ తో పాటూ బ్రూక్లిన్ క్రీమరీ ఐస్ క్రీమ్ వ్యాపారం కూడా ఉంది. ఇక అర్జున్ టెండూల్కర్ దేశవాళీ క్రికెట్ లో గోవాకు, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ఆడుతున్నాడు.

Arjun Tendulkar Engaged Sachin s Son Ties the Knot with Saaniya Chandok

ఇక అర్జున్ టెండూల్కర్ ఇప్పటివరకు 17 ఫస్ట్ క్లాస్, 18 లిస్ట్-ఎ తోపాటు 24 టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో అర్జున్ టెండూల్కర్ 33.51 సగటుతో 37 వికెట్లు పడగొట్టాడు. 23.13 యావరేజ్ తో 532 పరుగులు సాధించాడు. ముంబై ఇండియన్స్ జట్టు అర్జున్ ను 30 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. కానీ లాస్ట్ సీజన్ మొత్తం ఇతను బెంచ్ కే పరిమితం కావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+