Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అర్ష్‌దీపా.. ఏంట్రా ఇది ఇలా చేశావ్

టీ20 ఫార్మాట్‌లో ది బెస్ట్ అనిపించుకున్న బౌలర్‌లలో ఒకడు అర్ష్‌దీప్ సింగ్. ఈ ఐపీఎల్ సీజన్ లో మాత్రం అతనికి శుభారంభం లభించలేదు. మంగళవారం రాత్రి చండీగఢ్ ముల్లాన్ పూర్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన తొలి మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఏకంగా తన నాలుగు ఓవర్ల కోటాలో 42 పరుగులు ఇచ్చుకున్నాడు. అతని బౌలింగ్ ఎకానమీ రేటు 10కి పైమాటే. పైగా ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు.

ఏకంగా తొమ్మిది ఎక్స్ ట్రా పరుగులు ఇచ్చుకోవడం అర్ష్ దీప్ సింగ్ పై ట్రోలింగ్ కు దారి తీసింది. ఒకటిన్నర ఓవర్ అధికంగా వేసినట్టయిందతనికి. ఇందులో ఎనిమిది వైడ్లు, ఒక నో బాల్‌ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌కు ఒక్క వికెట్ కూడా దక్కలేదీ పంజాబ్ జట్టులో అత్యంత ఖరీదైన బౌలర్‌కు. తొలి మ్యాచ్‌లోనే అవాంఛిత రికార్డును నమోదు చేసుకున్నాడు. ఏ బౌలర్‌ కూడా తన పేరు మీద కోరుకోని విధంగా, ఐపీఎల్ చరిత్రలోనే సుదీర్ఘ ఓవర్ వేసిన బౌలర్‌గా నిలిచా. ఇది ఒక చెత్త రికార్డుగా అతని ఖాతాలో చేరింది.

Arshdeep Singh Sets IPL Stage Alight with Longest Over Adds Drama 11-Ball Over for PBKS Against GT

అర్ష్‌దీప్ సింగ్ తన మొదటి మూడు ఓవర్లలో 30 పరుగులు ఇచ్చుకున్నప్పటికీ పంజాబ్ కింగ్స్ కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అతనిపై నమ్మకం ఉంచి చివరి ఓవర్ బంతి అప్పగించాడు. అప్పటికే తీవ్ర ఒత్తిడిలో అర్ష్ దీప్ లైన్ అండ్ లెంగ్త్ కోల్పోయాడీ చివరి ఓవర్ లో. ఆ ఓవర్ లో నాలుగు వైడ్లు, ఒక నో బాల్‌ వేశాడు. ఈ ఎక్స్ ట్రాల కారణంగా ఆరు బంతుల్లో ముగియాల్సిన ఆ ఓవర్‌లో మొత్తం 11 బంతులు వేయాల్సి వచ్చింది.

ఈ ఓవర్‌లో అర్ష్‌దీప్‌కు వికెట్ లభించినా, అది నో బాల్ కావడంతో నిరాశ ఎదురైంది. 20వ ఓవర్‌లోని నాలుగో బంతికి రాహుల్ తెవాటియా వికెట్ పడగొట్టాడు. విజయ్ కుమార్ వైశాఖ్ క్యాచ్ పట్టినా బౌన్సర్ కారణంగా అంపైర్ నో బాల్‌గా ప్రకటించారు. అప్పటికే రెండు బౌన్సర్లు సంధించాడు అర్ష్ దీప్. అది మూడోది కావడంతో నో బాల్ ఇవ్వాల్సొచ్చింది. దీంతో తెవాటియా బతికిపోయాడు.

ఓవర్‌లోని చివరి బంతిని అంపైర్ మొదట వైడ్‌గా ప్రకటించినా, పంజాబ్ కింగ్స్ రివ్యూ కోరడంతో అది సరైన బంతిగా నిర్ధారించబడింది. లేదంటే అర్ష్‌దీప్ ఓవర్ కు 12 బంతులు వేయాల్సొచ్చేది. అర్ష్‌దీప్‌తో కలిపి ఐపీఎల్‌లో ఓవర్ లో 11 బంతులు వేసిన బౌలర్లు మరో ఆరుమంది ఉన్నారు. మహమ్మద్ సిరాజ్, తుషార్ దేశ్‌పాండే, శార్దూల్ ఠాకూర్, సందీప్ శర్మ, హార్దిక్ పాండ్యా ఆ జాబితాలో ఉన్నారు. గత సీజన్‌లో ముగ్గురు బౌలర్లు ఈ అవాంఛిత రికార్డును నమోదు చేయగా, ఈ సీజన్ ఆరంభంలోనే అర్ష్‌దీప్ ఈ క్లబ్‌లో భాగం అయ్యాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+