Asia Cup 2025: బిగ్ అప్ డేట్: భారత్- పాక్ మ్యాచ్ లు ఉండవా?
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఆసియా కప్ 2025 షెడ్యూల్ వెలువడింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. 28వ తేదీన ఫైనల్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ కు ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది.
ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది. ఆసియా కప్ 2025 షెడ్యూల్ ను ఖరారు చేయడానికి ఢాకాలో సమావేశమైంది ఆసియా క్రికెట్ కౌన్సిల్. సుమారు రెండు గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. అనంతరం తేదీలను ఖరారు చేసింది. 2025 ఆసియా కప్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తామని ప్రకటించింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంద ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ ధృవీకరించారు. త్వరలోనే షెడ్యూల్ ను విడుదల చేస్తామని అన్నారు. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుండి 28 వరకు జరుగనుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా దీన్ని హోస్ట్ చేయనున్నాయి. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 కోసం సన్నాహాలకు అనుగుణంగా ఈ టోర్నమెంట్ అదే ఫార్మాట్‌లో జరుగుతుంది.
ఈ ఎడిషన్‌లో ఎనిమిది జట్లు పాల్గొనబోతోన్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్ కోసం భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్, ఒమన్.. తలపడనున్నాయి. మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉంటాయని భావిస్తున్నారు.
చిరకాల ప్రత్యర్థుల మధ్య మూడు హై-ఓల్టేజ్ మ్యాచ్ లు జరిగే అవకాశం ఉంది. అన్నీ సవ్యంగా సాగితే.. భారత్- పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్ లు ఉండొచ్చు. గ్రూప్, సూపర్ 4లల్లో భారత్- పాకిస్తాన్ ఎదురుపడొచ్చు. ఈ రెండు జట్లు అంచనాలకు తగ్గట్టుగా రాణించగలిగితే ఫైనల్స్ లో ఢీ కొనడం ఖాయమౌతుంది.
భారత్- పాకిస్తాన్ మ్యాచ్ లపై పహల్గామ్ ఉగ్రవాద దాడి ప్రభావం చూపుతుందనే అనుమానాలు సైతం వ్యక్తమౌతోన్నాయప్పుడే. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన సంభవించిన ఈ మారణకాండ తరువాత భారత్- పాకిస్తాన్ జట్లు తలపడబోతోండటం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ ఉగ్రదాడికి నిరసనగా ఇప్పటికే వరల్డ్ ఛాంపియన్ లీగ్స్ ఆఫ్ లెజెండ్స్ లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. భారత్ తరఫున ఆడాల్సిన నలుగురు ఆల్ రౌండర్లు.. పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడబోమంటూ తేల్చి చెప్పారు. ఫలితంగా మ్యాచ్ రద్దు చేయాల్సొచ్చింది.












Click it and Unblock the Notifications