ఆసియా క్రీడల్లో భారత్‌కు ఊహించని ట్విస్ట్.. స్టార్ ప్లేయర్లకు బదులు బీ టీమ్?

Asian Games 2026: 2026 ఆసియా క్రీడలకు జపాన్‌లోని ఐచి-నగోయా వేదిక కానుండగా.. అక్కడ క్రికెట్ పోటీల కోసం కల్పిస్తున్న సౌకర్యాలు, ఏర్పాట్లపై బీసీసీఐ, ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ముందుగా ప్రకటించిన బలమైన ప్రధాన జట్టుకు బదులుగా బీ టీమ్(ద్వితీయ శ్రేణి) జట్టును మాత్రమే పోటీలకు పంపాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అల్లు అర్జున్ 'రాకా' మూవీలో బిగ్ సర్‌ప్రైజ్!
అల్లు అర్జున్ 'రాకా' మూవీలో బిగ్ సర్‌ప్రైజ్!

ఈ ఆందోళనకు ప్రధాన కారణం మ్యాచ్‌లు జరిగే మైదానంలో కనీస సదుపాయాలు సరిగ్గా లేకపోవడమే. క్రికెటర్ల కోసం ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్‌ల స్థానంలో మైదానంలోనే తాత్కాలికంగా టెంట్లను ఏర్పాటు చేశారని.. వాష్‌రూమ్‌లు, స్నానాల గదులు ఆ టెంట్ల నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి తోడు ప్లేయర్లు ఉండటానికి కేటాయించిన హోటల్ గదుల పరిమాణం కూడా చాలా చిన్నదిగా ఉండటం వల్ల కిట్ బ్యాగులు పెట్టుకోవడానికి కూడా స్థలం సరిపోవడం లేదని అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Asian Games 2026 India to Send B-Team Due to Poor Facilities in Japan Full Details Here

జపాన్‌లో ఆసియా క్రీడల్లో ఆటగాళ్ల కోసం సౌకర్యాలు లేకపోవడం, వసతుల లోపాలపై ఆసియా క్రికెట్ కౌన్సి సమావేశంలో జపాన్ ఒలింపిక్ అధికారులతో బోర్డు ప్రతినిధులు ఇప్పటికే చర్చించారు. ఈ నేపథ్యంలో మైదానం పరిసరాలను, సౌకర్యాలను స్వయంగా అంచనా వేసేందుకు బీసీసీఐ ఓ పరిశీలకుడిని జపాన్‌కు పంపనుంది. అతను అందించే నివేదిక ప్రాతిపదికన ప్రధాన జట్టును పంపాలా లేదా బీ టీమ్‌తో బరిలోకి దిగాలా అనేది బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది.

Hi Movie Review: నయనతార 'హాయ్' రివ్యూ.. రొటీన్ లవ్‌స్టోరీ మెప్పించిందా!
Hi Movie Review: నయనతార 'హాయ్' రివ్యూ.. రొటీన్ లవ్‌స్టోరీ మెప్పించిందా!

ప్రకటించిన ప్రధాన జట్టు వివరాలు
భారత్ ఇప్పటికే ఆసియా క్రీడల కోసం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో అత్యంత బలమైన జట్టును సిద్ధం చేసింది. ఇందులో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ వంటి అనుభవజ్ఞులతో పాటు ఇషాన్ కిషన్, సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశీ లాంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. 2023 హౌంగ్‌జౌ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సాదించిన భారత్.. ఈ సారి కూడా డిఫెండింగ్ ఛాంపియన్‌గా టైటిల్‌ను కాపాడుకోవాల్సి ఉంది. జపాన్ ఒలింపిక్ కమిటీ కల్పించే వసతులపై స్పష్టత వస్తేనే భారత్ ఏ జట్టుతో స్టేడియంలోకి దిగుతుందనే దానిపై క్లారిటీ రానుంది.

భారత ఆసియా క్రీడల జట్టు
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+