Asian Games 2026: ఒకే రోజు 3 గోల్డ్ మెడల్స్.. భారత్ గోల్డెన్ హ్యాట్రిక్!

Asian Games 2026: జపాన్‌‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సంచలన ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. బుధవారం ఒక్క రోజే భారత్ ఏకంగా మూడు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుని త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది. షూటింగ్ విభాగంలో నూతన ఆసియా రికార్డు నమోదు కాగా.. కాంపౌండ్ ఆర్చరీలో భారత వీరులు ఆధిపత్యం చెలాయించారు.

పీవీ సింధు బ్రేక్స్ డౌన్: ఎగ్జాస్ట్ అయిపోయా: 18 గంటల్లో మూడు మ్యాచ్ లా: ఏంటిది
పీవీ సింధు బ్రేక్స్ డౌన్: ఎగ్జాస్ట్ అయిపోయా: 18 గంటల్లో మూడు మ్యాచ్ లా: ఏంటిది

షూటింగ్‌లో ఆసియా రికార్డు బ్రేగ్.. నీరూ-కైనన్ ధమాకా!
ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత షూటర్లు నీరూ ధండా, కైనన్ చెనై అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతాకాన్ని ముద్దాడారు. క్వాలిఫికేషన్ రౌండ్లో నాలుగో స్థానంలో నిలిచిన ఈ జంట.. ఫైనల్లో తీవ్ర ఒత్తిడిని అధిగమించి 34 పాయింట్ల స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. ఖతార్ జోడీని రజతానికి పరిమితం చేయడమే కాకుండా ఖతార్ పేరిట ఉన్న 30 పాయింట్ల మునుపటి ఆసియా రికార్డును ఏకంగా 4 పాయింట్ల తేడాతో బద్ధలు కొట్టి కొత్త ఆసియా రికార్డును నెలకొల్పారు. వ్యక్తిగత ఈవెంట్లోనూ స్వర్ణం గెలిచిన నీరూకు ఇది ఈ టోర్నీలో రెండో పసిడి కావడం విశేషం.

Asian Games 2026 India Wins 3 Gold Medals in a Day with Shooting and Archery Records

ఆర్చరీలో చికితా తానిపర్తి డబుల్ గోల్డ్!
కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత యువ ఆర్చర్ చికితా తానిపర్తి ఒకే రోజు రెండు స్వర్ణ పతకాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. మొదటగా జ్యోతి సురేఖ వెన్నం, పృథిక ప్రదీప్‌లతో కలిసి చికిత మహిళల టీమ్ ఫైనల్లో చైనాపై 238-234 తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌‌లో భారత్ 238 స్కోరు సాధించి.. 2014 ఇంచియాన్ ఆసియా క్రీడల్లో దక్షిణ కొరియా నెలకొల్పిన ప్రపంచ రికార్డును సమం చేసింది. ఆ వెంటనే సాహిల్ జాదవ్‌తో కలిసి బరిలోకి దిగిన చికితా తానిపర్తి మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో దక్షిణ కొరియాపై ఉత్కంఠభరిత పోరులో గెలుపొందింది. భారత జోడి ఆరంభంలోనే 40-39 ఆధిక్యం సాధించి రెండో ఎండ్ తర్వాత తమ ఆధిక్యాన్ని రెండు పాయింట్లకు పెంచుకుంది. మూడో ఎండ్‌లో చికితా సాధించిన 9 పాయింట్లతో భారత్ ఆధిక్యం ఒక పాయింట్‌కు తగ్గడంతో, స్కోరు 118-117గా నిలిచింది.ఫైనల్ దశలో కొరియా పర్ఫెక్ట్ స్కోర్ సాధించి, భారత్‌పై ఒత్తిడి పెంచింది. గెలవాలంటే భారత్‌కు తమ చివరి రెండు బాణాలపై పర్ఫెక్ట్ 10లు అవసరమయ్యాయి. చికితా తానిపర్తి మరో 9 స్కోర్ చేయగా.. ఒత్తిడిలో ఉన్న సాహిల్ 10 స్కోర్‌తో లక్ష్యాన్ని ఛేదించి స్కోర్లను సమం చేశాడు. దీంతో మ్యాచ్ షూట్-ఆఫ్‌కు దారితీసింది. ఇక్కడ భారత జంట మరోసారి అద్భుతంగా రాణించింది. చికిత, సాహిల్ ఇద్దరూ 10 స్కోరు చేయగా, కొరియాకు చెందిన చోయ్ ఉన్ గ్యు కేవలం 9 స్కోరు మాత్రమే సాధించగలిగాడు. భారత్ 158-157 తేడాతో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.

వైభవ్ కంటే చిన్నోడే.. 11 ఏళ్లకే చరిత్ర సృష్టించిన బుడ్డోడు!
వైభవ్ కంటే చిన్నోడే.. 11 ఏళ్లకే చరిత్ర సృష్టించిన బుడ్డోడు!

ఈ విజయంతో 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌కు అర్హత సాధించిన తొలి దేశంగా కూడా భారత్ నిలిచింది. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో కాంపౌండ్ ఆర్చరీని చేర్చడం ఇదే మొదటిసారి.ఈ విధంగా బుధవారం భారత్ ఒకటి కాదు, ఏకంగా మూడు స్వర్ణ పతకాలను గెలుచుకుంది. షూటింగ్‌లో నీరూ, కైనన్ రికార్డు సృష్టించగా, ఒకే రోజు రెండు స్వర్ణ పతకాలు గెలిచి చికితా తానిపర్తి భారత ఆర్చరీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లింది. ఈ క్రీడల్లో భారత్ ఇప్పటివరకు తొమ్మిది స్వర్ణ పతకాలను గెలుచుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+