Asian Games 2026: భారత్‌కు బిగ్ షాక్.. చెదిరిన పసిడి కల!
Asian Games 2026: జపాన్‌లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల మహిళల సింగిల్స్ టెక్‌బాల్ విభాగంలో భారత క్రీడాకారిణి క్విన్సీ డిసౌజాకు తీవ్ర నిరాశ ఎదురైంది. సెమీ-ఫైనల్స్‌లో ఇండోనేషియాకు చెందిన ఇమా సుమయ చేతిలో 12-7, 9-12, 7-12 తేడాత ఆమె పరాజయం పాలయ్యారు. ఈ మ్యాచ్ లో గెలిచి ఉంటే భారత్‌కు కనీసం రజత పతకం ఖాయం అయ్యేది. కానీ ఈ ఓటమితో స్వర్ణ పతక కల చెదిరిపోయింది. అయినప్పటికీ ఆమెకు కాంస్య పతకం గెలుచుకునే అవకాశం ఇంకా సజీవంగా ఉంది. ఆదివారం జరిగే కాంస్య పతక పోరులో జపాన్ క్రీడాకారిణి యూనా సకమోటోతో డిసౌజా తలపడనున్నారు.
తొలి సెట్ గెలిచినా చేజారిన విజయం
మహిళల సింగిల్స్ సెమీ-ఫైనల్లో క్విన్సీ డిసౌజా అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. మొదటి సెట్‌ను 12-7తో గెలుచుకుని శుభారంభం చేసినప్పటికీ..ఇండోనేషియా ప్రత్యర్థి ఇమా సుమయ రెండో సెట్‌లో పుంజుకుని 12-9తో విజయం సాధించింది. నిర్ణయాత్మక మూడో సెట్‌లో భారత క్రీడాకారిణి ఒకానొక దశలో 3-0 ఆధిక్యంలో నిలిచినప్పటికీ. ఇమా సునయ ఒత్తిడిని అధిగమించి 12-7తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

గ్రూప్-ఏలో అగ్రస్థానం నుంచి సెమీస్ వరకు..
ఈ టోర్నీలో క్విన్సీ డిసౌజా ప్రయాణం ఎంతో ఆకట్టుకుంది. గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్‌లలో జపాన్, కంబోడియా క్రీడాకారిణులపై వరుస విజయాలు సాధించి, ఆమె తన గ్రూపులో అగ్రస్థానంలో నిలిచి సెమీ-ఫైనల్స్‌కు అర్హత సాధించింది. కానీ సెమీస్‌లో 1-2 తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది.
మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతక ఆశలు
మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత్ కాంస్య పతకానికి చేరువైంది. క్వార్టర్ ఫైనల్స్‌లో వియత్నాం జోడీ(జియాన్ నిఘీ ట్రిన్, హోంగ్ మిన్ టాన్ గుయెన్) చేతిలో 7-12, 10-12 తేడాతో క్విన్సీ డిసౌజా-మహమ్మద్ అనస్ ఇమ్రాన్ బేగ్ జంట ఓడిపోయింది. అయితే శుక్రవారం జరిగిన రిపెచేజ్ రౌండ్లో ఫిలిప్పీన్స్‌కు చెందిన జోడీని 12-3, 12-6 తేడాతో నేరుగా వరుస సెట్లలో ఓడించి ఆదివారం జరిగే కాంస్య పతక మ్యాచ్‌కు అర్హత సాధించారు.













Click it and Unblock the Notifications
