నిప్పులు చేరిగిన బుమ్రా..పెవిలయన్‌కు క్యూ కట్టిన ఆసీస్

ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఇరు జట్ల బౌలర్లు సత్తా చాటుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులకు, ఆతిథ్య ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌట్ అయ్యాయి. భారత పాస్ట్ బౌలర్ , కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బుమ్రా 5 వికెట్స్ తీయడం జరిగింది. టెస్టు కెరీర్‌లో బుమ్రా ఓవరాల్‌గా ఓ ఇన్నింగ్స్ అయిదు వికెట్లు 11 సార్లు పడగొట్టాడు.బుమ్రా దెబ్బకు ఆసీస్ బ్యాట్స్‌మెన్ పెవిలయన్‌కు క్యూ కట్టారు.

Australia were bowled out for 104 runs in the first Test match at Perth

తొలి ఇన్నింగ్స్ ముగింపు నాటికి భారత్‌కు స్వల్ప ఆధిక్యం లభించినా ఫలితాన్ని తేల్చే రెండవ ఇన్నింగ్స్‌లో ఎవరు ఆధిపత్యాన్ని సాధిస్తారో చూడాలి.భారత్, స్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట కొనసాగుతోంది. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేయగా.. ఆసీస్‌ 104 పరుగులకు ఆలౌటైంది. భారత్‌కు 46 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 26 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 79 రన్స్ చేసింది. భారత్ ఆధిక్యం (119) వంద దాటింది. జైస్వాల్ (42), రాహుల్ (34) క్రీజులో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+