టీమిండియా గుడ్ న్యూస్..మ్యాచ్‌కు పాకిస్థాన్‌ స్టార్ ప్లేయర్ దూరం

టీమిండియాతో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ టీంకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు , మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ భారత్‌తో జరిగే మ్యాచ్‌కు దూరం కానున్నాడని తెలుస్తోంది. కంటి దురద కారణంగా ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ ఆడటం లేదని సమాచారం. శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు కూడా బాబర్ ఆజమ్ హాజరుకాలేదు. దీంతో బాబర్ ఆజమ్ భారత్‌తో జరిగే మ్యాచ్ ఆడేది లేనిది అనుమానంగా మారింది.ఇప్పటికే వెన్నునొప్పి కారణంగా పాకిస్థాన్ జట్టు ఓపెనర్ ఫఖర్ జమాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు.ఇప్పుడు బాబర్ ఆజమ్ సైతం కీలక మ్యాచ్‌కు దూరం కానున్నాడు.ఒకవేళ బాబర్ ఆడకపోతే అది పాకిస్థాన్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే.

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ అర్థ సెంచరీతో రాణించాడు. జట్టు మొత్తం వైఫల్యం చెందినప్పటికీ, బాబర్ ఆజమ్ ఒక్కడే క్రీజులో నిలదొక్కుకుని అర్ధ సెంచరీ చేశాడు. మరోవైపు న్యూజిలాండ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోవడంతో ఆ జట్టుపై సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీంతో కీలకమైన భారత్ మ్యాచ్‌కు ముందు ఆ జట్టు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఇటువంటి సమయంలోనే బాబర్ ఆజమ్ కూడా దూరంగా కావడం ఆ జట్టుకు పెద్ద లోటే అని చెప్పాలి. బ్యాట్స్‌మెన్స్‌తో పాటు, బౌలర్లు సైతం గాడిలో పడాలని పాకిస్థాన్ కెప్టెన్ రిజ్వాన్ కోరుకుంటున్నాడు.

Babar Azam will miss the match against India

ఇక భారత్ జట్టు విషయానికి వస్తే..మొదటి మ్యాచ్‌లో గెలిచి మంచి జోష్‌లో కనిపింస్తోంది. షమీ బౌలింగ్‌లో అదరగొట్టగా, బ్యాటింగ్‌లో గిల్ సెంచరీతో రాణించాడు.అయితే కీలకమైన పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు టీమిండియా జట్టులో రెండు మార్పులు చేయబోతుంది. పాకిస్థాన్‌తో ఆడే ప్లేయింగ్‌ ఎలెవన్‌లో స్నిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు ఛాన్స్ దక్కేలా కనిపించడం లేదు.కుల్దీప్ యాదవ్‌ పక్కన పెట్టి అతని స్థానంలో వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకునే యోచనలో గౌతమ్‌ గంభీర్‌ ఉన్నట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. అలాగే హర్షిత్ రాణా స్థానంలో అర్షదీప్‌ సింగ్‌కు జట్టులో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత్ ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అర్షదీప్‌ సింగ్‌, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+