అతను జట్టులో ఉండగా టీమిండియా కప్ గెలిచిన చరిత్రే లేదు..!

ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగే ఫైనల్లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో టీమిండియా విజయం సాధించి ఫైనల్‌కు చేరగా, రెండో సెమీ ఫైనల్‌లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడగా, కివీస్ జట్టు విజయాన్ని అందుకుని ఫైనల్‌కు చేరుకుంది.దీంతో ఆదివారం టీమిండియాతో న్యూజిలాండ్ ఫైనల్‌లో తలపడనుంది.

దుబాయ్ వేదికగా టీమిండియా, కివీస్ జట్లు పోటీ పడనున్నాయి. లీగ్ దశలో న్యూజిలాండ్‌ను భారత జట్టు ఓడించింది. ఇదే ఫలితాన్ని ఫైనల్లో కూడా పునరావృతం చేయాలని టీమిండియా భావిస్తోంది. లీగ్ దశలో ఎదురైన పరాభవానికి పగ తీర్చుకోవాలని న్యూజిలాండ్ ప్రణాళికలు రచిస్తోంది. ఇదిలా ఉంటే టీమిండియాను ప్రస్తుతం ఓ సెంటిమెంట్‌ భయపెడుతోంది. ఒక సెంటిమెంట్‌ టీమిండియా ఫ్యాన్స్‌ను తెగ కలవరపెడుతోంది.

bad sentiment grips Team India ahead of the Champions Trophy final

అది ఏమిటంటే టీమిండియా సీనియర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ ఉన్న సమయంలో ఇప్పటి వరకు టీమిండియా ఒక్కసారి కూడా ఎటువంటి ఐసీసీ టైటిల్స్ గెలవలేదు. షమీ ఇప్పటి వరకు చాలానే ఐసీసీ ట్రోఫీలు ఆడాడు. కానీ అతను టీంలో ఉన్న సమయంలో జట్టు ఒక్క కప్ గెలిచింది లేదు. 2015 వన్డే వరల్డ్‌ కప్‌, 2019 వన్డే వరల్డ్‌ కప్‌, 2023 వన్డే వరల్డ్‌ కప్‌, 2021, 2023 వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్స్‌ ఇలా షమీ ఆడిన ఏ ఐసీసీ ఈవెంట్‌లో కూడా టీమిండియా గెలవలేదు.

2024లో షమీ టీ20 వరల్డ్‌ కప్‌ ఆడలేదు. కానీ ఆ టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచి భారత జట్టు వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ప్రస్తుతం టీమిండియా ఛాంపియన్ ట్రోఫీలో అదరగొడుతోంది. పైగా వరుస విజయాలు సాధిస్తూ, ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఈసారి ఎలాగైనా కప్ గెలవాలనే కసి టీమిండియా ఆటగాళ్లలో కనిపిస్తోంది.

కానీ షమీ సెంటిమెంట్ గుర్తుకు రావడంతో అభిమానులు భయపడిపోతున్నారు.అయితే ప్రస్తుతం షమీ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రతీ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ వేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో ఆ బ్యాడ్‌ సెంటిమెంట్‌ను తప్పని షమీ ప్రూ చేస్తాడని క్రికెట్‌ ఫ్యాన్స్‌ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే షమీ ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి జట్టుకు కప్‌ను అందిస్తాడేమో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+