బంగ్లాదేశ్ బిగ్ యూటర్న్.. కండిషన్స్ అప్లై !!
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ యూటర్న్ తీసుకుంది. ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ ను నిర్వహించడానికి నిరాకరించిన ఆ దేశం.. ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుంది. బోర్డు డైరెక్టర్ ఎం నజ్ముల్ ఇస్లాం చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఆందోళన చేపట్టిన ఆటగాళ్లు.. ఆయనను ఆర్థిక కమిటీ నుంచి తొలగించాలన్న తమ డిమాండ్‌తో సమ్మెను విరమించారు. బీసీబీతో గురువారం రాత్రి జరిగిన చర్చల తర్వాత ఈ సమస్య పరిష్కారమైంది. దీంతో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఈ సాయంత్రం తిరిగి ప్రారంభం కానుంది.
ఆటగాళ్ల డిమాండ్ అక్కడతో ఆగలేదు. నజ్ముల్ ఇస్లాంను బీసీబీ డైరెక్టర్ పదవి నుంచి కూడా తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 2026 టీ20 ప్రపంచ కప్ కోసం భారత్‌కు వెళ్లడం లేదని బీసీబీ ప్రకటించిన నేపథ్యంలో బోర్డుకు ఎటువంటి ఆర్థిక నష్టం ఉండదని, ప్లేయర్లే నష్టపోతారని, వారికి ఎటువంటి పరిహారం కూడా లభించదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కోట్లాది రూపాయలు ప్లేయర్లపై ఖర్చు చేస్తున్నారని, దీనికి అయిన డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ వ్యాఖ్యల తర్వాత బీసీబీ రంగంలోకి దిగింది. నజ్ముల్‌ను ఆర్థిక కమిటీ ఛైర్మన్ పదవి నుంచి తొలగించింది. ఇది సంస్థ ప్రయోజనాలకు అత్యవసరమని పేర్కొంది. ఈ వివాదాస్పద వ్యాఖ్యల నుంచి బీసీబీ వెంటనే స్పందించింది. తీవ్ర విచారం వ్యక్తం చేసింది. క్రికెట్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, శుక్రవారం నుండి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఆడతామని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని అటు బంగ్లాదేశ్ క్రికెటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా నిర్ధారించింది.
తమ డిమాండ్లను సాధ్యమైనంత త్వరగా నెరవేరుస్తామని బీసీబీ హామీ ఇచ్చిందని వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ (సీడబ్ల్యూఏబీ) అధ్యక్షుడు మహమ్మద్ మిథున్ విలేకరుల సమావేశంలో తెలిపారు. నజ్ముల్ ను ఆర్థిక కమిటీ నుంచి తొలగించడాన్ని స్వాగతించారు. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలనే డిమాండ్ కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని, ఇది ఇరు వర్గాల మధ్య ఇంకా పరిష్కారం కాని అంశంగా ఉందని అన్నారు. బీసీబీ డైరెక్టర్ ఇఫ్తికర్ రెహమాన్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం నజ్ముల్‌కు సంజాయిషీ నోటీసు జారీ చేసినట్లు చెప్పారు.
కాగా భద్రతా కారణాలను చూపుతూ.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తాము ఆడబోయే మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఇదివరకు ఐసీసీని అధికారికంగా అభ్యర్థించింది. టీ20 వరల్డ్ కప్ కోసం తమ జట్టును భారత్ కు పంపడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. భారత గడ్డపై తమ మ్యాచ్‌లను ఆడకూడదని 17 మంది బీసీబీ డైరెక్టర్లు తీర్మానించారని, దీనికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఓ ఐపీఎల్ ఫ్రాంఛైజీతో ఒప్పందం ఉన్నప్పటికీ తమ దేశ క్రికెటర్ భారత్‌లో ఆడలేకపోతే దానికి అర్థం లేదని స్పష్టం చేసింది అప్పట్లో.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications