కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కింగ్ రీ-ఎంట్రీపై బీసీసీఐ క్లారిటీ!
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంగ్లండ్ వన్డే సిరీస్‌తో పాటు ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్‌లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదివారం ప్రకటించింది. జూలై 14 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ కోసం 15 మందితో కూడిన బలమైన వన్డే జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో అందరి కళ్లూ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. గత ఐపీఎల్ ఫైనల్‌లో గాయపడిన కోహ్లీ.. మళ్లీ వన్డే జట్టులోకి తిరిగొచ్చాడు. అయితే, అతని ఎంట్రీపై బీసీసీఐ ఒక ట్విస్ట్ ఇచ్చింది.
కోహ్లీ రీ-ఎంట్రీ.. కానీ ఫిట్‌నెస్ క్లియరెన్స్ తప్పనిసరి!
ఇటీవల ముగిసిన ఐపీఎల్ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఒంటిచేత్తో గెలిపించి, రెండోసారి టైటిల్ అందించిన విరాట్ కోహ్లీ.. ఆ మ్యాచ్‌లోనే మోచేతి కండరాల (Hamstring) గాయానికి గురయ్యాడు. తీవ్రమైన నొప్పితోనే బ్యాటింగ్ చేస్తూ అజేయంగా 75 పరుగులు చేసిన కోహ్లీ, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు.

తాజాగా ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో కోహ్లీ పేరు ఉన్నప్పటికీ, అతను ఆడటం అనేది పూర్తిగా ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పైనే ఆధారపడి ఉంటుంది. జూన్ 22 (సోమవారం) నాడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (BCCI CoE) కి కోహ్లీ హాజరుకానున్నాడు. అక్కడ ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన తర్వాతే అతను ఇంగ్లండ్ విమానం ఎక్కనున్నాడు.
బుమ్రా ఇన్.. హార్దిక్ అవుట్!
ఈ వన్డే సిరీస్‌కు యువ సంచలనం శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మ జట్టులో ఉన్నప్పటికీ కెప్టెన్సీ బాధ్యతలను గిల్‌కు ఇవ్వడం గమనార్హం. ఇక టీమిండియా యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రావడం బౌలింగ్ విభాగానికి కొండంత బలాన్ని ఇస్తోంది. అయితే, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌కు అందుబాటులో లేడు. జూలై 14న బర్మింగ్‌హామ్, 16న కార్డిఫ్, 19న లండన్ వేదికలుగా మూడు వన్డేలు జరగనున్నాయి.
ఇంగ్లండ్ వన్డేలకు భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (ఫిట్‌నెస్‌ను బట్టి), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.
🚨 News 🚨
— BCCI (@BCCI) June 21, 2026
India’s ODI squad for the England tour announced.
𝗡𝗢𝗧𝗘: Varun Chakaravarthy has been ruled out of the Ireland T20I Series as he continues his rehab at the BCCI COE.
More Details ▶️ https://t.co/wOdXTQqJto #TeamIndia | #ENGvIND pic.twitter.com/t0GypgM4kp
ఐర్లాండ్ టీ20ల నుండి వరుణ్ చక్రవర్తి అవుట్!
మరోవైపు, ఐర్లాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు చిన్న షాక్ తగిలింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎడమకాలి గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఐపీఎల్ సమయంలో అతనికి ఈ గాయమైంది. అతని స్థానంలో జట్టులో స్వల్ప మార్పులు చేశారు.
ఐర్లాండ్ టీ20లకు అప్‌డేటెడ్ భారత జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.












Click it and Unblock the Notifications