గంభీర్‌కు బీసీసీఐ బిగ్ షాక్..కోచ్‌గా స్టార్ ఆటగాడు
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌కు షాక్ తగలబోతుందా అంటే అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. గౌతం గంభీర్ ప్రస్తుతం టీమిండియా జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. అంతకు ముందు గౌతం గంభీర్ పలు ఐపీఎల్ టీంలకు కోచ్‌గా పని చేశారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోవడంతో , గౌతం గంభీర్ ఆ బాధ్యతలు చేపట్టారు. గంభీర్ ఏ మూహార్తన టీమిండియాకు కోచ్‌గా మారాడో కానీ, భారత జట్టు చరిత్రలో ఎప్పుడూ చూడని పరాజయాలను చవి చూస్తోంది.
ఎవరూ ఊహించని విధంగా శ్రీలంక చేతిలో టీమిండియా దారుణ ఓటమిని చవి చూసింది. ఫలితంగా 27 ఏళ్ల తర్వాత టీమిండియాపై శ్రీలంక సిరీస్ నెగ్గగలిగింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాతో చేజార్చుకుంది. 36 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ టీం భారత జట్టుపై మ్యాచ్ గెలవడమే కాకుండా, సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా టీమిండియా దారుణంగా ఓడిపోయింది.దీంతో గౌతం గంభీర్‌పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

గౌతమ్ గంభీర్ జట్టు హెడ్ కోచ్‌గా మారిన తర్వాత, టీమిండియా చరిత్రలో పలు ఘోర పరాజయాలను చవిచూసింది. గౌతమ్ గంభీర్ తక్కువ వ్యవధిలోనే టీమ్ ఇండియాకు ఎన్నో అవమానకరమైన రికార్డులను అందించాడు. దీంతో అతన్ని హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ తెర మీదకు వస్తోంది. గౌతమ్ గంభీర్ కోచ్‌గా ఉంటే ఇంకెన్ని దారుణ ఓటములు చూడాలో అని క్రికెట్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఇదే సమయంలో బీసీసీఐ సైతం గౌతమ్ గంభీర్‌పై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈక్రమంలోనే అతని అధికారాలు తగ్గించే యోచనలో బీసీసీఐ ఉందని సమాచారం. దీనిలో భాగంగానే జట్టుకు కొత్త బ్యాటింగ్ కోచ్‌ను తీసుకునే ప్రయత్నాలు చేస్తోన్నట్టు తెలుస్తోంది. బ్యాటింగ్ కోచ్‌తో పాటు,జట్టుకు సపోర్టింగ్ స్టాఫ్‌ను తీసుకోవడానికి బీసీసీఐ రెడీ అవుతోంది. ఇంగ్లాండ్ జట్టు మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలను చేపట్టడానికి రెడీగా ఉన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకవేళ ఇదే జరిగితే హెడ్ కోచ్‌గా ఉన్న గౌతం గంభీర్‌కు బిగ్ షాక్ తగిలినట్టే.మరి బ్యాటింగ్ కోచ్ విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications