ఐపీఎల్ 2024 పూర్తి షెడ్యూల్: సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లు ఇవే..
IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‌లో అయిదు మ్యాచ్‌లు ముగిశాయి. అన్ని జట్లూ ఒక్కొక్క మ్యాచ్ ఆడేశాయి. ఒక రకంగా చెప్పాలంటే నేటి నుంచి రెండో రౌండ్ ఆరంభమౌతున్నట్టే. ఈ రౌండ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడబోతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దీనికి వేదిక. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
టార్గెట్ టాప్ 4..
రాయల్ ఛాలెంజర్స్‌కు ప్రతిష్ఠాత్మక మ్యాచ్ ఇది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో దారుణంగా ఓడిందీ జట్టు. ఇప్పుడు హోమ్ గ్రౌండ్‌పై పంజాబ్ కింగ్స్‌ను తలపడుబోతోంది. సొంత పిచ్‌పై ఈ మ్యాచ్ గెలిచి పరువు నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది ఆర్సీబీ. భారీ తేడాతో నెగ్గి, పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలవాలని భావిస్తోంది.

పంజాబ్‌తో..
మరోవంక- పంజాబ్ కింగ్స్ పరిస్థితి దీనికి భిన్నం. తాను ఆడిన తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఢిల్లీ కేపిటల్స్‌ను మట్టికరిపించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఆర్సీబీని ఓడించితే.. అగ్రస్థానానికి చేరుకుంటుంది. సీజన్‌లో వరుసగా తొలి రెండు మ్యాచ్‌లను గెలిచిన జట్టుగా నిలవగలుగుతుంది.
కంప్లీట్ షెడ్యూల్..
ఈ పరిస్థితుల్లో బీసీసీఐ తాజాగా ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు పూర్తి షెడ్యూల్ విడుదల కాలేదు. దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నందున.. ఐపీఎల్ రెండో సగం మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు తరలించాలని బీసీసీఐ మొదట్లో భావించింది. అందుకే ఏప్రిల్ 7వ తేదీ వరకు జరిగే 21 మ్యాచ్‌ల వరకు మాత్రమే షెడ్యూల్‌ను ప్రకటించింది.
మ్యాచ్‌లన్నీ ఇక్కడే..
ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుంది బీసీసీఐ. ఇక్కడే ఐపీఎల్ కంప్లీట్ సీజన్ పూర్తి చేయాలని భావించింది. దీనికి అనుగుణంగా పూర్తిస్థాయి షెడ్యూల్‌ను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే మే 24వ తేదీన ప్లేఆఫ్స్ మొదలవుతాయి.
ప్లేఆఫ్స్ ఇలా..
మే 21వ తేదీన క్వాలిఫయర్ షెడ్యూల్ అయింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదిక. ఆ మరుసటి రోజే ఎలిమినేట్ కూడా నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరుగుతుంది. క్వాలిఫయర్ 2 మే 24వ తేదీన షెడ్యూల్ చేశారు. అదే నెల 26వ తేదీన ఫైనల్ ఉంటుంది. క్వాలిఫయర్ 2, ఫైనల్స్‌కు చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియం ఆతిథ్యాన్ని ఇస్తుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కంప్లీట్ షెడ్యూల్ వివరాలిలా ఉన్నాయి.
1. ఈ నెల 27వ తేదీన ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది. ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది.
2. ఈ నెల 31వ తేదీన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌ను ఢీ కొడుతుంది.
3. ఏప్రిల్ 5వ తేదీన ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్
4. ఏప్రిల్ 9వ తేదీన మొహాలీలో పంజాబ్ కింగ్స్.
5. ఏప్రిల్ 15వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
6. ఏప్రిల్ 19వ తేదీన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ కేపిటల్స్.
7. ఏప్రిల్ 15వ తేదీన ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
8. ఏప్రిల్ 28వ తేదీన చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్.
9. మే 2వ తేదీన ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్.
10. మే 6వ తేదీన ముంబై ఇండియన్స్.
11. మే 8వ తేదీన ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్
12. మే 16వ తేదీన ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్.
13. మే 19వ తేదీన ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడుంది. ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడేసింది సన్‌రైజర్స్.
-
భారత్ ను ఛాంపియన్ గా నిలబెట్టిన ఒకే ఒక్కడు, ఆయన మాటే శాసనం..!! -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
Ind Vs NZ: ఫైనల్ ప్రారంభం వేళ టీమిండియాకు కొత్త టెన్షన్, లాస్ట్ మినిట్ లో..!! -
Ind vs NZ: ఫైనల్ వేళ టీమిండియాకు భారీ గుడ్ న్యూస్, 2024 రిపీట్..!! -
ఫిన్ అలెన్ vs బూమ్రా, ఎవరిని సైలెంట్ చేస్తే వారే ఛాంపియన్- గంభీర్ బిగ్ ప్లాన్..!! -
ఫైనల్ కోసం టీమిండియా బిగ్ ఛేంజ్- లక్కు మార్చే లెక్కతో బరిలోకి..!! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!!












Click it and Unblock the Notifications