Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి సెలెక్షన్ కమిటీ బిగ్ షాక్- చాలా ప్లాన్డ్ గా

భారత జట్టు మాజీ కేప్టెన్ రోహిత్ శర్మ, రన్ మెషీన్ విరాట్ కోహ్లీలకు ఎర్త్ పడింది. ఈ దిశగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్లాన్డ్ గా పావులు కదుపుతోంది. న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ముగిసీ ముగియంగానే వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకుంటోంది. సంవత్సరాల పాటు జాతీయ క్రికెట్ కు సేవలను అందించి, వేల కొద్దీ పరుగులు చేసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు పొగబెట్టినట్టయిందనే అభిప్రాయాలు ఉన్నాయి.

రోహిత్, కోహ్లీలను డిమోషన్ చేయనుంది బీసీసీఐ. ఈ మేరకు కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. దీని ప్రకారం- ప్రస్తుతం ఉన్న ఏ+ గ్రేడ్ కేటగిరీ పూర్తిగా రద్దు అవుతుంది. ఇది రద్దయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బీ గ్రేడ్‌ కాంట్రాక్ట్ బ్రాకెట్ లో చేరే అవకాశం ఉంది. ఈ కొత్త ప్రతిపాదనలు ఆమోదం పొందితే వారి ర్యాంక్ సైతం తగ్గుతుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఈ మార్పులను సూచించింది.

BCCI to Scrap A Contract as Kohli and Rohit Face Demotion to Grade B

ఏడు కోట్ల రూపాయల విలువ చేసే ఏ+ సెంట్రల్ కాంట్రాక్ట్ కేటగిరీని పూర్తిగా తొలగించాలని సూచించింది సెలెక్షన్ కమిటీ. ఏ, బీ, సీ అనే మూడు గ్రేడ్‌లను మాత్రమే కొనసాగించాలని కమిటీ సిఫార్సు చేసింది. టెస్టులు, టీ20 ఇంటర్నేషనల్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం, ప్రస్తుతం వన్డేలకు మాత్రమే పరిమితమైనందున రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి బీ గ్రేడ్ కాంట్రాక్ట్ లో మాత్రమే చేర్చాలని సెలెక్షన్ కమిటీ ప్రతిపాదించింది.

ప్రతి సంవత్సరం కూడా క్రికెటర్లకు నిధులు ఇవ్వడానికి ఉద్దేశించిందీ సెంట్రల్ కాంట్రాక్ట్. ప్లేయర్ల సీనియారిటీ, వారి గణాంకాల ప్రకారం.. కాంట్రాక్ట్ కేటగిరీ/గ్రేడ్ ను నిర్ధారిస్తుంది బీసీసీఐ. ఇప్పటివరకు ఏ+, ఏ, బీ, సీ గ్రేడ్‌లకు వరుసగా రూ. 7 కోట్లు, రూ. 5 కోట్లు, రూ. 3 కోట్లు, రూ. 1 కోటి వార్షిక రుసుముగా చెల్లిస్తూ వస్తోంది. వీటికి మ్యాచ్ ఫీజులు అదనం. తాజాగా ప్రతిపాదనలు, ఆర్థికపరమైన మార్పులు, బోర్డు ఆమోదంపై తదుపరి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో స్పష్టత వస్తుంది.

గత ఏడాది ఏప్రిల్ లో ప్రకటించిన 2024-25 సైకిల్ సెంట్రల్ కాంట్రాక్ట్ సిస్టమ్ ప్రకారం.. ఏ+ గ్రేడ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్రజడేజా, జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నారు. గ్రేడ్ ఏలో మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, రిషబ్ పంత్ చేరారు. టి20 ఫార్మట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ గ్రేడ్ బీలో కొనసాగుతున్నారు.

గ్రేడ్ సీలో రింకు సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజు శాంసన్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పాటిదార్, ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా వంటి ప్లేయర్లు ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+