శ్రేయస్ అయ్యర్‌కు బిగ్ షాక్!.. సూర్య సంచలన ప్రకటన
టీ20 ప్రపంచ కప్ 2026 ముందు టీమిండియాలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గాయపడిన తిలక్ వర్మ స్థానంలో మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్‌కు వస్తారనే దానిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. అందరు శ్రేయస్ అయ్యర్ వస్తాడని భావించినప్పటికీ.. సూర్యకుమార్ యాదవ్ మాత్రం మరో ప్లేయర్ పేరును ఖరారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. న్యూజిలాండ్‌తో జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం నాగ్‌పూర్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్యకుమార్ యాదవ్ టీమ్ కాంబినేషన్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
785 రోజుల తర్వాత రీ-ఎంట్రీ!
తిలక్ వర్మ గాయంతో మొదటి మూడు మ్యాచ్‌లకు దూరం కావడంతో ఆ స్థానంలో ఇషాన్ కిషన్ బరిలోకి దిగనున్నట్లు సూర్యకుమార్ యాదవ్ ధ్రువీకరించారు. దాదాపు 785 రోజుల (2 సంవత్సరాలకు పైగా) విరామం తర్వాత ఇషాన్ కిషన్ మళ్లీ భారత టీ20 జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఇషాన్ కిషన్ చివరిసారిగా నవంబర్ 2023లో ఆస్ట్రేలియాపై భారత్ తరఫున ఆడాడు. జార్ఖండ్ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక పరుగులు (517) చేసి, జట్టుకు టైటిల్ అందించిన ఇషాన్ తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు.

శ్రేయస్ అయ్యర్‌కు ఎందుకు అవకాశం లేదు?
శ్రేయస్ అయ్యర్ కూడా జట్టులో ఉన్నప్పటికీ.. అతడిని కాదని ఇషాన్‌కే ఎందుకు మొగ్గు చూపారో సూర్యకుమార్ యాదవ్ వివరించారు: "ఇషాన్ కిషన్ మా వరల్డ్ కప్ ప్లాన్స్‌లో ఉన్నాడు. అతనికి తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ ఇవ్వడం మా బాధ్యత. అందుకే నంబర్ 3లో ఇషాన్ ఆడతాడు. శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ఆటగాడు, కానీ ప్రస్తుతం జట్టు అవసరాల రీత్యా ఇషాన్‌కే ప్రాధాన్యత ఇస్తున్నాం." అని సూర్య తెలిపారు.
వరల్డ్ కప్ సన్నాహాలు
ఫిబ్రవరి 7 నుండి భారత్, శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ముందు న్యూజిలాండ్ సిరీస్ భారత్‌కు చివరి సన్నాహకం. శుభ్‌మన్ గిల్‌ను పక్కన పెట్టి మరి ఇషాన్‌ను వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోవడం ఈ నిర్ణయం ప్రాధాన్యతను చాటుతోంది.












Click it and Unblock the Notifications