CSK, MI తర్వాత ఆర్సీబీదే ఈ ఘనత-ఒక్క గెలుపుతో

ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ ఫైనల్ వచ్చేసింది. అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ సాయంత్రం ఈ మెగా మ్యాచ్ జరగనుంది. ట్రోఫీ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) తలపడనున్నాయి. క్వాలిఫైయర్ 1లో విజయం సాధించి ఆర్‌సీబీ నేరుగా ఫైనల్‌కు చేరుకోగా, క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి గుజరాత్ టైటాన్స్ తన బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ వరుస విజయాలతో దూకుడుగా కనపిస్తోంది. క్వాలిఫైయర్ 1లో ఇదే జట్టును ఓడించి ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుంది. రజత్ పటీదార్ సారథ్యంలోని జట్టు ఐపీఎల్ ప్లేఆఫ్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ 254 పరుగులు నమోదు చేసింది. విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, దేవదత్ పడిక్కల్, వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్‌లో రాణిస్తుండగా, భువనేశ్వర్ కుమార్, రసిక్ సలాం, జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో కీలకం అయ్యారు.

Blockbuster IPL Final RCB and GT Chase Second Crown in Thrilling Ahmedabad Showdown with Playing 11

ఈ టోర్నమెంట్‌లో విజయం సాధిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత ఐపీఎల్ టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకున్న మూడవ ఫ్రాంచైజీగా ఆర్సీబీ చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మాత్రమే టైటిల్స్ నిలబెట్టుకుంటూ వచ్చాయి. ఇప్పుడీ రెండూ కూడా లీగ్ దశలోనే తిరుగుముఖం పట్టాయి. గుజరాత్ టైటాన్స్ గెలిచినా రెండోసారి ఛాంపియన్ అవుతుంది.

క్వాలిఫైయర్ 1లో ఓటమి తర్వాత గుజరాత్ టైటాన్స్ బలంగా పుంజుకుంది. రాజస్థాన్ రాయల్స్‌పై క్వాలిఫైయర్ 2లో 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, ఐపీఎల్ ప్లేఆఫ్ చరిత్రలోనే అత్యధిక సక్సెస్ ఫుల్ ఛేజింగ్ టీమ్ గా రికార్డు సృష్టించింది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని టైటాన్స్‌కు టాప్ ఆర్డర్ బ్యాటర్లు, బౌలర్లు నిలకడగా రాణిస్తోండటం ప్లస్ పాయింట్. ఈ ఫైనల్ మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్ సైతం రాణిస్తే, గుజరాత్ తన రెండో ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది.

రజత్ పటిదార్ కెప్టెన్సీ రికార్డ్ అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు 30 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన పటిదార్ ఖాతాలో 20 విజయాలు, 10 ఓటములు ఉన్నాయి. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ రికార్డును పరిశీలిస్తే.. 42 మ్యాచ్‌లకు నాయకత్వం వహించి 24 విజయాలు, 18 ఓటములు సాధించాడు. క్వాలిఫయర్ 2లో సెంచరీ చేసిన ఊపులో ఉన్నాడు గిల్. సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్ ఓపెనింగ్ జోడీ నిలదొక్కుకుంటే భారీ స్కోర్ తప్పదు.

ఆర్సీబీ తుదిజట్టులో.. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, జాకబ్ డఫ్ఫీ, రసిక్ సలాంకు చోటు దక్కొచ్చు.

ఇంపాక్ట్ ప్లేయర్లు: రొమారియో షెపర్డ్, సుయాష్ శర్మ, కనిష్క్ చౌహాన్, అభినందన్ సింగ్, జోర్డాన్ కాక్స్.

గుజరాత్ తుదిజట్టులో.. శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, నిశాంత్ సింధు, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కుల్వంత్ ఖేజ్రోలియా, కగిసో రబాడా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఆడొచ్చు.

ఇంపాక్ట్ ప్లేయర్లు: రాహుల్ తెవాటియా, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, కుమార్ కుశాగ్రా, సాయి కిషోర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+