ఐపీఎల్ అంటేనే ఇంట్రస్ట్ పోయింది బై- బౌలర్లు ఫూల్స్ అయ్యారు: సీవీ ఆనంద్
ఐపీఎల్ టైటిల్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలబెట్టుకుంది. వరుసగా రెండో సీజన్ లో కూడా ఛాంపియన్ గా ఆవిర్భవించింది. ఆదివారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ను అయిదు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన జీటీ నిర్ణీత 20 ఓవర్లల్లో 155 పరుగులే చేయగా.. దీన్ని 18 ఓవర్లల్లో అయిదు వికెట్లు కోల్పోయి అందుకుంది. 161 పరుగులు చేసింది.
ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లీ మరోసారి విజృంభించాడు. 42 బంతుల్లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 75 పరుగులతో అజేయంగా నిలిచాడు. విన్నింగ్ స్ట్రోక్ తో మ్యాచ్ ను ముగించాడు. మరో ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ 16 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 32 పరుగులు బాదాడు. చివర్లో టిమ్ డేవిడ్ 24 పరుగులు మినహా మిగిలిన బ్యాటర్లెవరూ పెద్దగా పరుగులు చేయలేదు. లో స్కోర్ కావడంతో ఆర్సీబీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు.

ఈ మ్యాచ్ పై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సీజన్ ఐపీఎల్ పై పూర్తిగా ఆసక్తి పోయిందని వ్యాఖ్యానించారు. ఏ మాత్రం చూడాలని అనిపించలేదని పేర్కొన్నారు. అసలు ఇది క్రికెట్టే కాదని తేల్చి చెప్పారు. ఈ ఐపీఎల్ లో ఏ మాత్రం సరదా అనేది లేకుండా పోయిందని అన్నారు. మ్యాచ్ లల్లో 250కి పైగా పరుగులు నమోదు కావడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది క్రికెట్ కు మంచిది కాదని అభిప్రాయపడ్డారు.
Unfortunately, I lost total interest in this year’s IpL when I saw huge scores of 250 odd being posted in 20 overs , every ball being hit and the bowlers being made to look like fools . This is not cricket ! It’s no fun
— CV Anand IPS (@CVAnandIPS) May 31, 2026
Sorry , for once I cannot and do not want to predict 🙏🏻😊 https://t.co/rP62xS33ZH
ఐపీఎల్ ఫైనల్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ లో ఏ జట్టు గెలుస్తుందో ప్రిడిక్ట్ చేయాలంటూ ఓ ఎక్స్ యూజర్ ఆయనకు విజ్ఞప్తి చేయగా.. దీనికి సీవీ ఆనంద్ బదులిచ్చారు. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఈ ఏడాది ఐపీఎల్‌పై తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు. 20 ఓవర్లలో 250కి పైగా భారీ స్కోర్లు రావడం, ప్రతీ బంతిని బాదడం వల్ల ఇంట్రెస్ట్ పోయిందని ఆయన పేర్కొన్నారు. బౌలర్లను బ్యాటర్లు ఫూల్స్ చేశారని వ్యాఖ్యానించారు. "ఇది క్రికెట్ కాదు! సరదా లేదు.." అని తేల్చి చెప్పారు. ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లను అంచనా వేయడం తనకు ఇష్టం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications