Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కావ్య vs ప్రీతీ జింటా: ఆ ఆటగాడి కోసం ఎంతైనా, దక్కేదెవరికి - కొత్త రికార్డు ఖాయం..!!

IPL 2026 Auction: ఐపీఎల్ వేలానికి రంగం సిద్దం అయింది. రేపు (మంగళవారం) అబుదాబీ వేదికగా వేలం జరగనుంది. ఈ సారి వేలంలో ఒక విదేశీ ఆటగాడు గత రికార్డులను బ్రేక్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఇద్దరు మహిళా ఫ్రాంచైజీలు తమ జట్టు కోసం ఈ ఆటగాడిని దక్కించు కొనేందుకు పోటీ పడుతున్నారు. గతంలో పంత్, అయ్యర్ రికార్డులను బ్రేక్ చేస్తూ ఈ సారి వేలం లో ఈ విదేశీ ఆటగాడు కొత్త రికార్డు నెలకొల్పటం ఖాయంగా కనిపిస్తోంది.

ఐపీఎల్ - 2026 వేలం వేళ కొత్త రికార్డులు ఖాయంగా కనిపిస్తున్నాయి. గత మెగా వేలంలో రిషబ్ పంత్ (రూ. 27 కోట్లు), శ్రేయస్ అయ్యర్ (రూ. 26.75 కోట్లు) నెలకొల్పిన అత్యధిక ధర రికార్డుల ను ఈసారి ఒక ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ బద్దలు కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామరూన్ గ్రీన్ కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడుతున్నాయి. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్, వికెట్లు తీయగలగడం అతని ప్రత్యేకత. ఇలాంటి నైపుణ్యాలు ఉన్న ఆటగాళ్లు వేలంలో చాలా అరుదు. గతంలో ముంబై ఇండియన్స్ ఇతనిని రూ. 17.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు అతను మరింత పరిణతి చెందిన ఆటగాడిగా వేలంలోకి వస్తున్నాడు. బెన్ స్టోక్స్ వంటి ఇతర స్టార్ ఆల్ రౌండర్లు అందుబాటులో లేకపోవడంతో, ఫ్రాంచైజీలన్నీ గ్రీన్ కోసమే ఎగబడే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది.

Cameron Green is expected to break the bank at the IPL 2026 auction here the details

ఇప్పటి వరకు ఉన్ని సమాచారం మేరకు ఈ ఆటగాడిని దక్కించుకోవడానికి ఫ్రాంచైజీ ఓనర్లు ఎంత ధరైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేకంగా ఇద్దరు మహిళా ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నారు. చేతిలో ఎక్కువ డబ్బు లేకపోయినా, కీలకమైన ఆల్ రౌండర్ కోసం పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతీ జింటా పోటీ పడుతున్నారు. ఇక.. కావ్య మారన్ ఎప్పుడూ భారీ ధరలకు ఆటగాళ్లను కొనడంలో ముందుంటారు. ప్యాట్ కమిన్స్‌కు రూ. 20.50 కోట్లు పెట్టిన చరిత్ర ఆమెకుంది. దీంతో, ఈ సారి కెమరన్ విషయంలోనూ పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది. కెమెరాన్ గ్రీన్ కోసం భారీగా ఖర్చు చేయడానికి కేకేఆర్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేకేఆర్ పర్స్ వాల్యూ (రూ. 64 కోట్లు) ఎక్కువగా ఉంది. దీంతో, గ్రీన్‌ను రికార్డు ధరకు సొంతం చేసుకునే ఛాన్స్ ఉందని అంచనా.

అయితే, ముంబై ఇండియన్స్ దగ్గర కేవలం రూ. 2.75 కోట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి వారు గ్రీన్‌ను కొనలేరు. కానీ, ఒకవేళ వారి దగ్గర డబ్బు ఉంటే కచ్చితంగా అంబానీలు ఇతని కోసం పోటీ పడే ఛాన్స్ దాదాపు లేనట్లే. ప్రస్తుత అంచనాల ప్రకారం, కామరూన్ గ్రీన్ ధర రూ. 20 కోట్ల నుండి రూ. 25 కోట్లు దాటే అవకాశం ఉంది. ఒకవేళ కేకేఆర్ లేదా ఆర్సీబీ వంటి జట్లు పట్టుబడితే, రిషబ్ పంత్ రూ. 27 కోట్ల రికార్డు కూడా బద్దలయ్యే ఛాన్స్ ఉంది. డిసెంబర్ 16న జరిగే వేలంలో కామరూన్ గ్రీన్ ఏ జట్టుకు వెళ్తాడో.. ఏ రికార్డు క్రియేట్ అవుతుందో అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+