సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో వివాదం..స్టార్ హీరోలు డిష్యూం డిష్యూం..బ్యాట్ విసిరి
సెలబ్రిటీ క్రికెట్ లీగ్- 2025 రసవత్తరంగా సాగుతోంది.సెలబ్రిటీ లీగ్ , సాధారణ క్రికెట్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా జరుగుతోంది. తెలుగు వారియర్స్‌తో పాటు కర్ణాటక బుల్డోజర్స్, చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్, భోజ్ పురి దబంగ్, పంజాబ్ ది షేర్ జట్లు ఈ సెలబ్రిటీ లీగ్‌లో పోటీపడుతున్నాయి.అన్ని జట్లు ఢీ అంటే ఢీ అని తలపడుతున్నాయి.అయితే సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో ఆటగాళ్ల మధ్య వివాదం చేలరేగింది.
ಗೊತ್ತಲ್ಲ ಯಾರ್ ಹುಡುಗರು ಅಂತ 😎
— 𝗸𝗮𝗿𝘂𝗻𝗮𝗮𝗱𝗮-𝓴𝓲𝓬𝓬𝓱𝓪👑 (@kiladi46441) February 22, 2025
ಪ್ರೀತಿ ಇಂದ ಬಂದ್ರೆ ಮಾಣಿಕ್ಯ 💎
ಮುಟ್ಟೋಕೆ ಬಂದ್ರೆ ಬಚ್ಚನ್ 🤙🏻
ಬಂದ್ವ ಹೋದ್ವ ಅಷ್ಟೇ ಇಟ್ಕೋ ಬೇಕು 🤫@ccl @Karbulldozers @KicchaSudeep #Karnatakabulldozers pic.twitter.com/AMVuktCt1r
దీంతో గ్రౌండ్‌లోనే ఆటగాళ్లు గొడవకు దిగారు. పంజాబ్ ది షేర్, కర్ణాటక బుల్డోజర్స్ జట్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భాగంగా శనివారం పంజాబ్ ది షేర్, కర్ణాటక బుల్డోజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కర్ణాటక జట్టు కేవలం 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ మధ్యలో నింజా ఎన్జే, కీపర్ సుదీప్ మధ్య గొడవ మొదలైంది. ఇరు ఆటగాళ్ల మధ్య మాటల తూటాలు పేలాయి.

దీంతో గ్రౌండ్‌లో వాతవారణం ఒక్కసారిగా వేడెక్కింది.ఒకరినొకరు వార్నింగ్ ఇచ్చుకునే వరకు పరిస్థితి వెళ్లింది. పరిస్థితి చేయి దాటిపోయిందని గ్రహించిన అంపైర్లు, ఆటగాళ్లకు సర్ది చెప్పారు.అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం కిచ్చా సుదీప్ స్వయంగా వెళ్లి తాను గొడవ పడిన ఆటగాడు నింజాతో చేతులు కలిపాడు. అతన్ని హగ్ చేసుకుని నవ్వుతో మాట్లాడాడు. అలాగే పంజాబ్‌కు చెందిన ఇతర ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications