ఓన్లీ న్యూజిలాండ్.. : తేల్చేసిన రవిశాస్త్రి- ట్రోలింగ్ స్టఫ్
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. తుదిదశకు చేరుకుంది. ఇంకొక్క రోజే బాకీ. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఫైనల్ గేమ్ మొదలవుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం దీనికి వేదిక. టైటిట్ హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగిన భారత జట్టును ఎదుర్కొనబోతోంది న్యూజిలాండ్. లీగ్ దశలో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది భారత్. దీన్నీ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.
ఈ పరిస్థితుల్లో- ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ విజేతపై తన అంచనాలను వెల్లడించాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. భారత్‌ను ఫేవరెట్‌గా పేర్కొంటూనే- న్యూజిలాండ్‌ను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయలేమని హెచ్చరించారు. భారత్‌ను ఓడించగలిగే జట్టు ఏదైనా ఉందంటే అది న్యూజిలాండ్ మాత్రమే తేల్చి చెప్పారు.

భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోన్నప్పటికీ- గెలిచే అవకాశాలు పరిమితంగా ఉన్నాయని పేర్కొన్నాడు. ది ఐసీసీ రివ్యూలో మాట్లాడాడు రవిశాస్త్రి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌పై తన అంచనాలను వెల్లడించాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని డిపార్ట్‌మెంట్లల్లోనూ న్యూజిలాండ్.. భారత్‌కు ధీటుగా ఉందని కితాబిచ్చాడు. టీమిండియాను ఓడించగల సత్తా ఒక్క కివీస్‌కే ఉందని తేల్చి చెప్పాడు.
బ్యాటింగ్ మెషీన్ విరాట్ కోహ్లీ ఫామ్.. మ్యాచ్‌ను మలుపు తిప్పగలుగుతుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ప్రత్యర్థి టీమ్‌లో కేన్ విలియమ్సన్.. అతనికి ధీటుగా రాణించగలడని అన్నాడు. జట్టు అవసరాలకు తగ్గట్టుగా కీలక సమయాల్లో రాణించగల సామర్థ్యం విలియమ్సన్‌కు ఉందని చెప్పాడు.
ఇప్పుడున్న ఫామ్ ప్రకారం చూసుకుంటే విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర అత్యంత విలువైన ప్లేయర్లని, బ్యాటింగ్‌కు అదనపు బలమని వ్యాఖ్యానించాడు. ఒక్క 10 పరుగులు చేస్తే- ఇక వారిని ఆపడం కష్టతరమని అన్నాడు. అటు కేన్ విలియమ్సన్ అదే స్థాయిలో సత్తా చాటుతున్నాడని గుర్తు చేశాడు. దక్షిణాఫ్రికాపై రచిన్ రవీంద్రతో కలిసి కేన్ సెంచరీ చేయడం అద్భుతమని ప్రశంసించాడు.
25 ఏళ్ల వయస్సులోనే రచిన్ రవీంద్ర ఐసీసీ వన్డే టోర్నమెంట్లల్లో అయిదు సెంచరీలు సాధించడం అసాధారణమైన విషయమని రవిశాస్త్రి చెప్పాడు. రచిన్ రవీంద్ర క్రీజ్‌లో కదిలే విధానం తనకు చాలా ఇష్టమని, అతడిలో ఓ రకమైన ఫ్లూయెన్సీ ఉందని, అది చూడటానికి అద్భుతంగా ఉంటుందని అన్నాడు.
క్రీజ్‌లో రచిన్ స్వేచ్ఛగా కదులగలడని, కట్, స్వీప్ షాట్లను అద్భుతంగా ఆడతాడని చెప్పాడు. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనడంలో నిష్ణాతుడని పేర్కొన్నాడు. రచిన్‌లో మంచి టెంపర్‌మెంట్ ఉందని చెప్పాడు. నిలకడగా రాణించడం విలియమ్సన్ ప్రధాన బలమని పేర్కొన్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా, ప్రశాంతంగా ఉంటాడని, ధ్యానంలో కూర్చున్న ఓ రుషిలా ఉంటాడని చెప్పాడు.












Click it and Unblock the Notifications