ఆస్ట్రేలియాకు బిగ్ షాక్- ఆల్‌రౌండర్ గుడ్‌బై: ఐపీఎల్‌పై..

Marcus Stoinis: ప్రతిష్ఠాత్మకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు గడువు సమీపిస్తోంది. ఈ నెల 19వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. మార్చి 9వ తేదీ వరకు కొనసాగుతుంది. తొలి మ్యాచ్‌‌లో ఆతిథ్య దేశం పాకిస్తాన్‌ను తలపడనుంది న్యూజిలాండ్. మార్చి 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.

భారత్ సహా ఎనిమిది దేశాలు- పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఇందులో తలపడనున్నాయి. భారత్ ఆడబోయే మ్యాచ్‌లన్నీ కూడా తటస్థ వేదిక దుబాయ్‌లో జరుగనున్నాయి. మిగిలినవి- కరాచీ, లాహోర్, రావల్పిండిల్లో షెడ్యూల్ అయ్యాయి.

Champions Trophy 2025 Marcus Stoinis announces immediate retirement from ODIs

గ్రూప్-ఏలో భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్.. గ్రూప్ బీలో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల బోర్డులు కూడా తమ జట్లను ప్రకటించాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ముమ్మరంగా కసరత్తు కొనసాగిస్తోన్నాయి.

ఈ పరిస్థితుల మధ్య టైటిల్ హాట్ ఫేవరెట్ ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేల నుంచి వైదొలిగాడు. వన్డే ఇంటర్నేషనల్స్ నుంచి తప్పుకొంటోన్నాడు. ఈ రిటైర్మెంట్ తక్షణమే అమలులోకి వస్తుందని కూడా వెల్లడించాడు.

దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై పోస్ట్ చేశాడు. ఆస్ట్రేలియా తరఫున వన్డే క్రికెట్ ఆడటం ఒక అద్భుతమైన ప్రయాణంగా అభివర్ణించాడు. గ్రీన్ జెర్సీ ధరించిన ప్రతి నిమిషం కూడా తనకు చిరస్మరణీయంగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించాడు.

ఆ అవకాశం కల్పించిన క్రికెట్ ఆస్ట్రేలియాకు మార్కస్ స్టొయినిస్ కృతజ్ఞతలు తెలిపాడు. రిటైర్మెంట్ అనేది అంత సులువుగా తీసుకున్న నిర్ణయం కాదని వ్యాఖ్యనించాడు. వన్డేల నుండి వైదొలిగి తన కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టడానికి ఇదే సరైన సమయం అని భావిస్తన్నట్లు చెప్పాడు. హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని పేర్కొన్నాడు.

ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌కు ఇప్పటికే కేప్టెన్ పాట్ కమ్మిన్స్ దూరం అయ్యే అవకాశం ఉంది. గాయం కారణంగా అతను ట్రోఫీ ఆడకపోవచ్చు. అదే జరిగితే- డాషింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ లేదా టాప్ ఆర్డర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌లల్లో ఒకరికి కేప్టెన్సీ క్యాప్ దక్కవచ్చనే అంచనాలు ఉన్నాయి.

కాలి మడమ గాయంతో బాధపడుతున్నాడు కమ్మిన్స్. ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌తో జరిగిన బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ నుంచీ అతను ఇబ్బంది పడుతోన్నాడు. ఆ ట్రోఫీ తరువాత మరే సిరీస్‌కు అందుబాటులో లేడు. రెండో బిడ్డ జన్మించిన కారణంగా శ్రీలంకతో సిరీస్‌ నుంచీ తప్పుకొన్నాడు కమ్మిన్స్. తొలి రెండు వన్డేలకూ స్కిప్ అయ్యాడు.

అదే సమయంలో మడమ నొప్పి తిరగబెట్టిన నేపథ్యంలో సిరీస్ మొత్తానికీ దూరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 19వ తేదీ నుంచి ఆరంభం అయ్యే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడకపోవచ్చని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తెలిపారు. ప్రస్తుతం అతను మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడని, ఇంకో రెండు రోజుల్లో స్పష్టత రావొచ్చని చెప్పారు.

ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే ఆస్ట్రేలియా జట్టులో- పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా ఎంపికయ్యారు. ఇప్పుడు స్టొయినిస్ స్థానంలో మరో కొత్త ముఖాన్ని తీసుకోవాల్సి వచ్చింది క్రికెట్ ఆస్ట్రేలియాకు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+