CSK vs MI: రాణించిన రచిన్ రవీంద్ర.. సీఎస్కే శుభారంభం
CSK vs MI: ఐపీఎల్ లో చెన్నై శుభారంభం చేసింది. ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాహుల్ త్రిపాఠి(2), శివమ్ దూబే(9), దీపక్ హుడా(3), శామ్ కరణ్(4) విఫలం కాగా.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(53), రచిన్ రవీంద్ర 65*, జడేజా 17 రాణించారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన విఘ్నేష్ పుతుర్ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్, విల్ జాక్స్ తలో వికెట్ తీశారు.
టాస్ ఓడిపోయిన అనంతరం ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ కు దిగింది. ఆఫ్ఘనిస్తాన్ 'మిస్టరీ' స్పిన్నర్ నూర్ అహ్మద్ 18 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టడంతో ముంబైకి భారీ దెబ్బ తగిలింది. నూర్ మహ్మద్ మాత్రమే కాకుండా.. ఖలీల్ అహ్మద్ 29 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై జట్టులో తిలక్ వర్మ(31), సూర్యకుమార్ యాదవ్(29) పరవాలేదనిపించారు.

ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ డకౌట్ కాగా.. నమన్ ధీర్(17), రియాన్ రికెల్టన్(13), విల్ జాక్స్(11), రాబిన్ మింజ్(3), మిచెల్ శాంట్నర్(11) పరుగులు మాత్రమే చేశారు. చివర్లో దీపక్ చాహర్(28) రాణించడంతో ముంబై స్కోరు 150 దాటగలిగింది. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ 4, ఖలీల్ అహ్మద్ 3, రవిచంద్రన్ అశ్విన్, నాథన్ ఎలిస్ తలో వికెట్ పడగొట్టారు.
𝙁𝙞𝙣𝙞𝙨𝙝𝙞𝙣𝙜 𝙬𝙞𝙩𝙝 𝙖 𝘽𝘼𝙉𝙂 💪
— IndianPremierLeague (@IPL) March 23, 2025
Rachin Ravindra takes #CSK to a win over #MI with a brilliant maximum 💛
Scorecard ▶ https://t.co/QlMj4G7kV0#TATAIPL | #CSKvMI | @ChennaiIPL pic.twitter.com/rVjsGQOHyD












Click it and Unblock the Notifications