కోహ్లీ సెంచరీ.. గౌతం గంభీర్ ఏం చేశాడో చూడండి..!
విరాట్ కొహ్లీ, గౌతం గంభీర్‌ల మధ్య జరిగిన గొడవ గురించి తెలియని క్రికెట్ అభిమాని ఉండరంటే అతిశేయోక్తి కాదేమో అనిపిస్తోంది. ఎందుకంటే వీరిద్దరు క్రికెట్ మైదానంలో, మైదానం వెలుపల పలుమార్లు ఘర్షణకు దిగారు. వాస్తవానికి గతంలో ఐపీఎల్ సందర్భంగా కొహ్లీ-గంభీర్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకున్నాయి. ఇద్దరూ ఆటగాళ్లుగా కొనసాగుతున్న సమయంలోనే వీరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. కోహ్లీ అవుట్ అయిన పెవిలియన్‌కు వెళ్తోన్న సమయంలో అతన్ని గంభీర్ ఏదో అనడం, దీనిపై కోహ్లీ వెనక్కి వచ్చి సమాధానం ఇవ్వడం జరిగింది.
ఆ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు కలుగజేసుకుని ఇద్దర్ని శాంతింపజేశారు. ఆ తర్వాత గంభీర్ ఐపీఎల్ కోచ్‌గా మారినప్పటికీ వీరి మధ్య వైరం మాత్రం అలాగే కొనసాగింది. అయితే గంభీర్ టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరిద్దరు స్నేహపూర్వకంగా కలిసి ఉంటున్నారు. కోహ్లీతో వివాదంపై గంభీర్ మాట్లాడుతూ .. తామిద్దరి మధ్య బంధం ఎలాంటిదో దేశంలో ఎవరికీ తెలియదన్నాడు.

కోహ్లీతో తన బంధం ఎవరికీ తెలియాల్సిన అవసరం కూడా లేదన్నాడు. జనానికి మసాలా ఇవ్వాల్సిన తరహాలో తమ బంధం ఉండక్కర్లేదన్నాడు. తాజాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. సెంచరీ చేసిన కోహ్లీని గంభీర్ గట్టిగా హగ్ చేసుకుని అభినందించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక పెర్త్ టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది.
Stop Scrolling and Like This Masterpiece by BCCI🗿 #ViratKohli #AUSvsIND #IPLAuction pic.twitter.com/5iUrU4QhKE
— Mufaddal Parody (@mufaddal_voira) November 24, 2024
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులు చేయగా, ఆసీస్ 104 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌కు 46 పరుగుల ఆధిక్యం లభించింది. 100 పరుగులతో కోహ్లీ నాటౌట్‌గా నిలిచాడు. 534 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 12 పరుగులకే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌గా వచ్చిన నాథన్ ఆండ్రూ మెక్‌స్వీనీ వికెట్‌తో పాటు,మార్నస్ లాబుస్‌చగ్నే వికెట్‌లను బుమ్రా పడగొట్టాడు.ఆసీస్ కెప్టెన్ కమిన్స్ వికెట్‌ను హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తీశాడు.












Click it and Unblock the Notifications