IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!!
IPL లో కొత్త హీరో తెర మీదకు వచ్చాడు. అసలు సిసలైన టీ20 మజాను అందించాడు. నిజమైన టీ20 క్రికెట్ సూపర్ హీరోగా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీని డామినేట్ చేస్తూ విశ్వరూపం ప్రదర్శించాడు. ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ వెతుకుతున్న పేరు కూపర్ కనోలీ. ఐపీఎల్ లో పంజాబ్ తరపున బ్యాటింగ్ చేసిన ఈ యువ ఆల్ రౌండర్ రాత్రికి రాత్రే సంచలనంగా మారిపోయాడు. అసలు ఇంతకీ ఎవరీ కూపర్ కనోలీ. 22 ఏళ్ల ఈ యువ సంచలనాన్ని పాంటింగ్ ఏరి కోరి ఎంపిక చేయటం వెనుక కారణం ఏంటి..
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంతో పాటు ఉత్కంఠగా కొనసాగుతోంది. న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పుర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓ వైపు వర్షం.. మరోవైపు వికెట్లు పడుతున్నప్పటికీ ఒంటరి పోరాటం చేసి జట్టుకు విజయాన్ని అందించాడు పంజాబ్ ఓపెనర్ కూపర్ కనోలీ. అరంగేట్రంలోనే పంజాబ్ తరఫున 44 బంతుల్లో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి అదరహో అనిపించాడు. ప్రస్తుతం కూపర్ కనోలీ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాడు. కూపర్ కనోలీ ఆస్ట్రేలియా క్రికెటర్. ఈ 22 ఏళ్ల యువ ఆల్‌రౌండర్.. ఆసీస్ క్రికెట్ జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శనలు చేశాడు. ఐపీఎల్ 2026 వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. కనోలీ 2022 అండర్-19 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

బిగ్ బాష్ లీగ్ 2022-23 ఫైనల్లో పెర్త్ స్కార్చర్స్ తరఫున కేవలం 11 బంతుల్లో 25 పరుగులు చేసి జట్టుకు టైటిల్ అందించాడు. అలాగే 2023-24 షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్లో తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రంలోనే 90 పరుగులు చేసి వెస్ట్రన్ ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. గత ఏడాది శ్రీలంకపై టెస్ట్ అరంగేట్రం కూడా చేశాడు. అదనంగా 8 వన్డేలు, 11 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం కనోలీకి ఉంది. గుజరాత్ టైటాన్స్‌పై మ్యాచ్‌లో కానోలీ అద్భుత ఇన్నింగ్స్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. కంటే ముందు ఆడిన గత ఐదు టీ20 మ్యాచ్‌ల్లో అతను చేసింది కేవలం 15 పరుగులు మాత్రమే.
పైగా అంతర్జాతీయ టీ20ల్లో నూ అతని ట్రాక్ రికార్డ్ అంత గొప్పగా ఏమీ లేదు. కానీ, కానోలీ మాత్రం పశ్చిమ ఆస్ట్రేలియా క్రికెటర్లకే ఉండే ఆ పట్టుదలను చూపించాడు. ఎక్కడా భయపడకుండా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కానోలీ, ఆ తర్వాత గేర్ మార్చాడు. కగిసో రబడా లాంటి ఫాస్ట్ బౌలర్లను కూడా లెక్కచేయకుండా బౌండరీల వర్షం కురిపించాడు. చివరికి 44 బంతుల్లో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. 19.1 ఓవర్లలోనే పంజాబ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు.
-
సీఎస్కే వదిలేశాక ధోనీతో మాటల్లేవ్ ..! రవీంద్ర జడేజా షాకింగ్..! -
IPL 2026: 25 కోట్ల ఆల్ రౌండర్ పై కేకేఆర్ వర్సెస్ ఆస్ట్రేలియా..! తేల్చేసిన హెడ్ కోచ్..! -
IPL మ్యాచ్‌లకు ఉచితంగా 3 టికెట్లు - కండీషన్స్ అప్లై..!! -
CSK అతి చెత్త రికార్డ్- వీళ్ల కంటే SRH ఎంతో నయం -
CSK కొంప మునిగిందక్కడే.. రాజస్థాన్‌కు టర్నింగ్ పాయింట్! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications