అసలు రిటైర్మెంట్ ఇవ్వాల్సింది అశ్విన్ కాదు..అతనే....!

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ప్రదర్శన అంతంతమాత్రంగానే సాగుతోంది. ఈ సిరీస్‌లో ఒకరిద్దరు మినహా మిగిలిన ఆటగాళ్లు తేలిపోతున్నారు. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు జట్టుకు భారంగా మారుతున్నారు. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మెన్ కోహ్లీ కూడా ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో టెస్ట్ నుంచి తప్పుకోగా, కీలకమైన సిడ్నీ టెస్ట్‌లో కోహ్లీ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. దీంతో కోహ్లీపై నెటిజన్లు మండిపడుతున్నారు.అతను రిటైర్మెంట్ ఇవ్వాలంటూ పోస్టులు పెడుతున్నారు. విరాట్ కోహ్లీ అంటే కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు, ఒక బ్రాండ్. ఆట పట్ల అతని అంకితభావం, అతని ఆకట్టుకునే ఆట, అతని నాయకత్వ లక్షణాలు అతన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడాకారులలో ఒకడిగా నిలిపాయి. కోహ్లీ తన అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.కోహ్లీ భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు అనేక విజయాలు సాధించాడు.

అతని నాయకత్వం కింద భారత జట్టు కొత్త ఎత్తులకు ఎదిగిందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఇంకా చెప్పాలంలే విదేశాల్లో జట్టుగా ఎలా ఆడాలో కోహ్లీ నాయకత్వంలోనే అందరికి తెలిసింది. తన అగ్రెసివ్‌తో టీంకు ఎన్నో విజయాలను అందించాడు. అయితే గత కొంత కాలంగా కోహ్లీ తన స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో కోహ్లీ ఫెయిల్ అవుతూ వస్తున్నాడు.కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్‌లోని కొన్ని చిన్న మార్పులు ఈ విఫలాలకు కారణమవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Cricket fans are angry about Kohli s retirement

అతను ముందుగా తన ఫ్రంట్ ఫుట్‌ను ఎక్కువగా ఉపయోగించేవాడు, ఇప్పుడు బ్యాక్ ఫుట్‌పై ఆధారపడుతున్నాడు. ఈ మార్పు వల్ల అతని షాట్ సెలెక్షన్‌పై ప్రభావం పడుతోంది. తాజాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరుగుతున్న తొలి టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. ఆ తర్వాత జరిగిన వరుస మ్యాచుల్లో కోహ్లీ విఫలం అయ్యాడు. ముఖ్యంగా నాలుగో టెస్టులో జట్టు ఓటమి తర్వాత అందరూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.

ఫాంలో లేనని చెప్పి, కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో టెస్ట్ నుంచి తప్పుకున్నాడు. ఇదే టెస్ట్‌లో కోహ్లీ ఘోరంగా విఫలం అయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేసిన కోహ్లీ, కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగులకే పెవిలియన్ చేరి జట్టును మరింత కష్టాల్లోకి నెట్టాడు. కోహ్లీ వరుసగా ఫెయిల్ అవ్వడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టుకు నీ సేవలు చాలు.. ఇక రిటైర్మెంట్ ఇచ్చేయ్ అంటూ నెటజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+