పసికూనపై చేతులెత్తేసిన క్రిస్టియానో రొనాల్డో

ఫిఫా వరల్డ్ కప్ లో సంచలనం నమోదైంది. బలమైన పోర్చుగల్ ను డెబ్యూటెంట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో షాక్ ఇచ్చింది. 1-1 గోల్స్ తేడాతో నిలువరించింది. ఈ పసికూనపై అవలీలగా గెలుస్తుందని భావించినప్పటికీ.. రిజల్ట్ వేరే. పోర్చుగల్‌ను కాంగో ప్లేయర్లు ఖంగు తినిపించారు. మెరికల్లాంటి ప్లేయర్ల ముందరి కాళ్లకు బంధం వేశారు. ధీటుగా ప్రతిఘటించారు. ఈ అద్భుత డ్రాతో కాంగో.. ప్రపంచకప్ చరిత్రలో మొదటి మ్యాచ్ లోనే గోల్, ప్లస్ పాయింట్ సాధించిన రికార్డును సొంతం చేసుకుంది.

ఇటీవల మరణించిన డియోగా జోటాకు నివాళి అర్పిస్తూ ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ ఆటగాళ్లంతా నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. మ్యాచ్ ప్రారంభమైన 6వ నిమిషంలోనే పోర్చుగల్ ఖాతా తెరిచింది. పెడ్రో నెటో అందించిన అద్భుతమైన పాస్‌ను యంగ్ మిడ్‌ఫీల్డర్ జోవావో నెవెస్ హెడర్ ద్వారా గోల్‌గా మలిచాడు. ఆ వెంటనే ఆకాశం వైపు వేలిని చూపిస్తూ డియోగా జోటాకు నివాళి అర్పించాడు. ఈ గోల్ ను అతనికి అంకితం చేశాడు. దీంతో పోర్చుగల్ కు ఎదురు ఉండదని అందరూ భావించారు.

Cristiano Ronaldo Again Goes Goalless Extends Major Tournament Drought Portugal Draw With DR Congo

మ్యాచ్ మొదటి అర్ధభాగం ముగిసేలోపు డీఆర్ కాంగో బలంగా పుంజుకుంది. మొదటి అర్ధభాగం ఎక్స్ ట్రా టైమ్ లో కాంగో సంచలనం సృష్టించింది. ఆర్థర్ మసువాకు కొట్టిన కార్నర్ కిక్‌ను యోవాన్ విస్సా అద్భుతమైన హెడర్‌తో గోల్ పోస్ట్‌కు చేర్చాడు. ఇది డీఆర్ కాంగోకు వరల్డ్ కప్ చరిత్రలోనే తొలి గోల్ కావడం విశేషం. దీంతో స్కోర్ 1-1 సమమైంది. సెకెండ్ హాఫ్ లో పోర్చుగల్ ఎంత ప్రయత్నించినా మరో గోల్ సాధించలేకపోయింది. కాంగో డిఫెండర్లు ఆ జట్టును అడ్డుకున్నారు.

మ్యాచ్ ముగియడానికి కొద్దిసేపటి ముందు జోవావో కాన్సెలో బైసికిల్ కిక్ ఇచ్చినప్పటికీ.. అది ఆఫ్ సైడ్‌గా తేలడంతో పోర్చుగల్ డీలా పడింది. వ్యూహాత్మకంగా ఈ మ్యాచ్ ఆడింది డీఆర్ కాంగో. స్కోర్ సమం అయిన తర్వాత అటాక్ కంటే కూడా డిఫెన్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. పోర్చుగల్ ను మరో గోల్ దక్కనివ్వకుండా ఉండేందుకు ప్రయత్నించింది. హెడ్ కోచ్ సెబాస్టియన్ డెసాబ్రే వ్యూహాలు ఈ మ్యాచ్‌లో అద్భుతంగా పనిచేశాయి. డిఫెన్స్‌ను పటిష్టం చేసుకుంటూ పోర్చుగల్ వంటి దిగ్గజ జట్టును నిలువరించి పాయింట్ సాధించడం కాంగోకు పెద్ద నైతిక విజయం.

41 ఏళ్ల పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో ​​రొనాల్డో ఈ మ్యాచ్ లో కూడా చేతులెత్తేశాడు. తనదైన శైలిలో రాణించలేకపోయాడు. ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయాడు. అంతర్జాతీయస్థాయిలో అత్యధికంగా 143 గోల్స్ చేసిన రికార్డు ఉన్నప్పటికీ మెగా టోర్నమెంట్లలో అతను విఫలమౌతున్నాడు. గోల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ప్రపంచకప్, యూరో కప్‌లలో కలిపి రొనాల్డో వరుసగా 10 మ్యాచ్‌ల్లో ఒక్క గోల్ కూడా చేయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లలో ఆయన మొత్తం 33 షాట్లు కొట్టగా 11 మాత్రమే టార్గెట్‌ను చేరాయి.

తన కెరీర్‌లో 229వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన రొనాల్డోకు ఈ పోరులో గోల్ కొట్టే అవకాశాలు చాలా తక్కువగా లభించాయి. ప్రపంచకప్‌లలో ఇప్పటివరకు రొనాల్డో ఖాతాలో ఉన్న గోల్స్ సంఖ్య.. ఎనిమిది. కాగా, ఆయన సమకాలీన ప్రత్యర్థి లియోనెల్ మెస్సీ అల్జీరియాపై సాధించిన హ్యాట్రిక్‌తో ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 16 గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

ఫిఫా వరల్డ్ కప్ 2022లో ఉరుగ్వే, దక్షిణకొరియా, స్విట్జర్లాండ్, మొరాకో, యూరో కప్ 2024లో చెకియా, టర్కీ, జార్జియా, స్లోవేనియా, ఫ్రాన్స్, ఈ ఫిఫా వరల్డ్ కప్ లో డీఆర్ కాంగోపై రొనాల్డో ఒక్క గోల్ కూడా సాధించలేకపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+