చెన్నై సూపర్ కింగ్స్ తో 15 ఏళ్ల బంధానికి తెర- అట్నుంచి గోల్డెన్ ఆఫర్?

ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ లో మరో బిగ్ వికెట్ పడే అవకాశాలు కనిపిస్తోన్నాయి. కొద్దిరోజుల కిందటే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ జట్టును వీడాడు. ఇప్పుడు అదే బాటలో మరొకరు ఈ ఫ్రాంఛైజీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఫ్రాంఛైజీతో 15 సంవత్సరాల పాటు కొనసాగిన బంధానికి వీడ్కోలు పలకడం వైపే ఆ స్టార్.. మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

అతనే.. మైకెల్ హస్సీ.. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్. ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా నియమితుడైన స్టీఫెన్ ఫ్లెమింగ్ జట్టును మరింత బలోపేతం చేయడంలో భాగంగా తన చిరకాల మిత్రుడు, ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆల్ రౌండర్ హస్సీని ఇంగ్లాండ్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా నియమించే దిశగా పావులు కదుపుతున్నాడు. ఫ్లెమింగ్ నుంచి తనకు ఆఫర్ అందిందని హస్సీ స్వయంగా వెల్లడించాడు కూడా.

CSK Batting Coach Weighs Up Coaching England Against His Former Australia Team Stephen Fleming Pitch

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీతో ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లకు విడదీయరాని బంధం ఉంది. 15 ఏళ్లుగా వీరిద్దరూ ఆ జట్టులో సహచర ఆటగాళ్లుగా, ఆ తర్వాత కోచింగ్ స్టాఫ్ కొనసాగారు. అత్యధికంగా ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకున్న జట్లల్లో ఒకటిగా నిలిపారు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అయిదుసార్లు చొప్పున ఐపీఎల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ స్థాయిలో టైటిల్ గెలిచిన జట్టు మరొకటి లేదు.

చెన్నై సూపర్ కింగ్స్ కు గుడ్ బై: తెగిన 18 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం
చెన్నై సూపర్ కింగ్స్ కు గుడ్ బై: తెగిన 18 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం

ఈ బాండింగ్ వల్లే ఫ్లెమింగ్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ విభాగ బాధ్యతలను హస్సీకి అప్పగించాలని అనుకుంటున్నాడు. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోన్నానని హస్సీ తెలిపాడు. యాషెస్ సిరీస్ నాటికి జట్టును అన్ని విధాలుగా రాటు దేల్చేలా చేయాలని ఫ్లెమింగ్ భావిస్తోన్నాడని, ఇందులో భాగంగా బ్యాటింగ్ కోచ్ గా తనను తీసుకోవాలనే ప్రతిపాదన పెట్టాడని చెప్పాడు.

ఈ నెల 24 నుంచి సిమ్ కార్డు నిబంధనల్లో మార్పులు- ఇకపై ఆటోమేటిక్ గా
ఈ నెల 24 నుంచి సిమ్ కార్డు నిబంధనల్లో మార్పులు- ఇకపై ఆటోమేటిక్ గా

ఈ విషయంపై అంత త్వరగా ఏ నిర్ణయాన్నీ తీసుకోలేనని హస్సీ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ జట్లకు కోచింగ్ బాధ్యతలు చేపడితే కుటుంబానికి దూరంగా ఎక్కువ రోజులు గడపాల్సి ఉంటుందని, ప్రస్తుతం తనకు కుటుంబ అవసరాలే ముఖ్యమని వ్యాఖ్యానించాడు. గతంలో ఇంగ్లాండ్ వన్డే, టీ20 ఫార్మట్ కు కోచింగ్ టీమ్ లో పని చేసిన అనుభవం హస్సీకి ఉంది. 2022లో ఇంగ్లాండ్ జట్టు టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న సమయంలో ఆ జట్టు బ్యాటింగ్ విభాగానికి అసిస్టెంట్ కోచ్ గా పని చేశాడు.

ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను ఎంపిక చేయడం చాలా గొప్ప నిర్ణయమని మైకేల్ హస్సీ కొనియాడాడు. ఫ్లెమింగ్ అత్యంత చాకచక్యం కలిగిన కోచ్ అని, ఆటగాళ్ల ప్రదర్శన, వ్యక్తిగత సంబంధాలను బ్యాలెన్స్ చేయడంలో నిపుణుడని చెప్పుకొచ్చాడు. వ్యూహాత్మకంగా పరిస్థితులకు అనుగుణంగా జట్టును నడిపించగలరని హస్సీ ధీమా వ్యక్తం చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
q