CSK: క్రికెట్ ఫ్యాన్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ క్రేజీ న్యూస్..!!
క్రికెట్ ఫ్యాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ అప్డేట్ ఇచ్చింది. సీఎస్కే యాజమాన్యం తక ఐపీఎల్ సామ్రాజ్యం మరింత విస్తరించాలని డిసైడ్ అయింది. ఈ మేరకు వచ్చే సీజన్ కోసం కొత్త పెట్టుబడి లతో సిద్దం అవుతోంది. ఇందు కోసం ప్రతిపాదనలు సిద్దం చేసిన యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్ లో పలు రికార్డులు సొంతం చేసుకున్న సీఎస్కే ఇప్పుడు తాజా నిర్ణయంతో మరింతగా ఫ్యాన్స్ ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఓ క్రేజీ న్యూస్ అందించింది. ఐపీఎల్‌లో టాప్ జట్లలో ఒకటైన సీఎస్కే డబ్ల్యూపీఎల్‌లోకి అడుగు పెడుతున్నట్లు ఆ ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. ఈ మేరకు ఇన్వెస్ట్ ఇన్ తమిళనాడు సదస్సులో ప్రకటన చేసారు. త్వరలోనే ఈ ప్రణాళిక అమలు దిశగా నిర్ణయాలు ఉంటాయని.. ఇందు కోసం కొంత సమయం తీసుకుం టుందని స్పష్టం చేసారు.

మహిళల క్రికెట్‌లో పెట్టుబడులు పెట్టడమే తమ మొదటి లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మహిళల క్రికెట్ జట్టులో పెట్టుబడులు పెట్టడానికి ఫ్రాంచైజీకి స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో సీఎస్‌కే తన పరిధిని విస్తరించ నున్నట్లు స్పష్టం చేసారు. అందులో తొలి ప్రాధాన్యం మహిళల క్రికెట్‌కే ఉంటుందని చెప్పారు. కాలక్రమేణా ఇతర క్రీడల్లో కూడా సీఎస్కే అవకాశాలను పరిశీలిస్తుందని కీలక ప్రకటన చేసారు.
ప్రస్తుతం డబ్ల్యూపీఎల్‌లో ముంబై, బెంగళూరు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఫ్రాంచైజీలు మాత్రమే ఉన్నాయి. ఐపీఎల్‌లో సత్తా చాటిన చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి జట్లు ఇంకా మహిళల ప్రీమియర్ లీగ్‌లోకి రాలేదు. కాగా.. మహిళల ప్రీమియర్ లీగ్ కు ఈ మధ్య కాలంలో ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం జరగుతున్న సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్ ఈ రోజు జరగనుంది.
ఇందులో గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు ఫిబ్రవరి 5న ఫైనల్‌లో ఆర్సీబీతో పోటీ పడనుంది. సీఎస్కే నిర్ణయంతో ఐపీఎల్ లో ఉన్న మిగిలిన జట్లు సైతం మహిళల ప్రీమియర్ లీగ్ వైపు ఆసక్తి చూసే అవకాశం ఉంది. దీని ద్వారా ఇక నుంచి ఐపీఎల్ తో పోటీగా డబ్ల్యూపీఎల్ సైతం హోరా హోరీగా మారే ఛాన్స్ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications