CSK ఓడింది..ఆ జట్లను ముంచింది- ప్లే ఆఫ్స్ ఛాన్స్ ఇక వీరికే..!!

CSK ఓటమితో ప్లే ఆఫ్స్ రేసు ఒక్క సారిగా మారిపోయింది. ఐపీఎల్ కీలక దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్ సమీకరణాలు మారుతున్నాయి. ఖాయం అనుకున్న జట్లకు జలక్ లు తప్పటం లేదు. ఇదే సమయంలో పాయింట్ల పట్టికలోనూ మార్పులు జరుగుతున్నాయి. పాయింట్లలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు వేచి చూడాల్సిన పరిస్థితి. లక్నో చేతిలో చెన్నై ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్ ఛాన్స్ కష్టంగా కనిపిస్తోంది. దీంతో.. ఏ జట్లు ప్లే ఆఫ్స్ చేరుతాయనేది ఉత్కంఠ పెంచుతున్నాయి.

ఐపీఎల్ లో కీలక దశకు చేరింది. ప్లే ఆఫ్స్ రేసులో ప్రధాన టీంలు నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అన్ని విభాగాల్లోనూ విఫలమై భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్‌తో సమానంగా 12 పాయింట్లు ఉన్నప్ప టికీ, నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటం వల్ల చెన్నై ఒక స్థానం కిందకు దిగజారాల్సి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో చెన్నై ప్లేఆఫ్స్ చేరాలంటే సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. CSK తన మిగిలిన రెండు మ్యాచ్‌లైన సన్‌రైజర్స్, గుజరాత్ టైటాన్స్‌లపై ఖచ్చితంగా గెలిస్తే.. 14 మ్యాచ్‌ల నుండి 16 పాయింట్లు లభిస్తాయి. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆ జట్టుకు టాప్-4 లో నిలవడానికి ఇది సరిపోతుంది.

ఉచిత బస్సు పథకం అమలు వేళ కొత్త కష్టాలు...!!
ఉచిత బస్సు పథకం అమలు వేళ కొత్త కష్టాలు...!!
csk-playoff-hopes-take-massive-hit-after-loss-to-lucknow-super-giants-here-the-scenario

మారుతున్న ప్లే ఆఫ్స్ లెక్కలు

అక్కడే కొత్త లెక్కలు సైతం చెన్నై అవకాశాల పైన ప్రభావం చూపిస్తున్నాయి. ఈసారి 5 జట్లకు 16 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు సాధించే అవకాశం ఉంది. దీంతో రన్ రేట్ ఇక్కడ కీలకం కానుంది. ఒకవేళ మిగిలిన రెండు మ్యాచ్‌లలో చెన్నై ఒక్కటి మాత్రమే గెలిస్తే, వారి ఖాతాలో 14 పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఆ పరిస్థితిలో టాప్-4 లో నిలవడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. అప్పుడు పూర్తిగా ఇతర జట్ల గెలుపోటములు, నెట్ రన్ రేట్‌ పైనే ఆధారపడవలసి ఉంటుంది. అయితే.. సీఎస్కే కెప్టెన్ మాత్రం ఇప్పటికీ ధీమాగానే ఉన్నారు. వచ్చే మ్యాచ్‌లలో ఎవరు బాగా ఆడితే ఆ రోజును మనకు అనుకూలంగా మార్చుకుంటామని ఆశిస్తున్నానని రుతురాజ్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన లక్నో సూపర్ జెయింట్స్.. చెన్నై కొంపముంచడం, ఇప్పుడు చెన్నై తన తరువాతి పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడటానికి సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్ చెన్నై - సన్ రైజర్స్ రెండు టీంలకు ప్లే ఆఫ్స్ రేసు ముంగిట కీలకంగా మారుతోంది. దీంతో.. ప్లే ఆఫ్స్ కు చివరగా ఏ టీంలు చేరుతాయి అనేది ఆసక్తిని పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+