అల్లు అర్జున్ మ్యూచువల్ ఫ్యాన్స్ రచ్చ ఎక్స్‌ట్రార్డినరి
సిమ్లా: ఐసీసీ ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియా రెచ్చిపోతోంది. న్యూజిలాండ్‌పై భారీ స్కోర్‌ను సాధించే దిశగా దూసుకెళ్తోంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పరుగుల వరద పారిస్తోన్నారు ఆస్ట్రేలియా బ్యాటర్లు. ఈ క్రమంలో ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీ సైతం పూర్తి చేసుకున్నాడు.
టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ను ఎంచుకుంది న్యూజిలాండ్. ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 26 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్- 109, డేవిడ్ వార్నర్- 81 పరుగులతో చెలరేగారు. ఓవర్‌కు తొమ్మిది చొప్పున పరుగులను పిండుకున్నారు. వారిద్దరూ అవుట్ అయిన తరువాత స్కోర్ బోర్డ కొంచెం నెమ్మదించింది.

స్టీవెన్ స్మిత్ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 35 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. మిఛెల్ మార్ష్, మార్నుస్ లాంబుషేన్ క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ దూకుడు చూస్తోంటే ఆ జట్టు స్కోర్ బోర్డ్ 350 మార్క్‌ను దాటడం ఖాయంగా కనిపిస్తోంది. తొలిసారిగా కివీస్ బౌలర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోన్నారిక్కడ.
జట్టు భారీ స్కోర్ చేయడానికి గట్టి పునాది వేశారు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్. కివీస్ బౌలర్లపై రెచ్చిపోయి ఆడాడు. డేవిడ్ వార్నర్ 65 బంతుల్లో ఆరు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 81 పరుగులు చేయగా.. ట్రావిస్ హెడ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 67 బంతుల్లో ఏడు భారీ సిక్సర్లు, 10 బౌండరీలతో 109 పరుగులు సాధించాడు.
ఒకవంక వార్నర్ జోరు కొనసాగుతున్న సమయంలో ధర్మశాల స్టేడియంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్లకార్డ్ కనిపించడం ఆకట్టుకుంది. పుష్ప- ది రైజ్ పార్ట్ 1లో తగ్గేదే లేదనే స్టిల్‌లో కనిపించింది అల్లు అర్జున్ బొమ్మ. అదే ప్లకార్డ్‌పై డేవిడ్ వార్నర్ ఫొటోనూ పేస్ట్ చేశారు ఫ్యాన్స్. అల్లు అర్జున్- డేవిడ్ వార్నర్ మ్యూచువల్ ఫ్యాన్స్ స్టేడియంలో సందడి చేశారు.
డేవిడ్ వార్నర్ భారీ షాట్లను ఆడిన ప్రతీసారీ చిందులు వేశారు అభిమానులు. తగ్గేదే లే అనే మేనిరిజంతో రచ్చ రచ్చ చేశారు స్టేడియంలో. అల్లు అర్జున్- డేవిడ్ వార్నర్‌కు మంచి మ్యూచువల్ ఫ్యాన్ బేస్ ఉందనేది ఇక్కడే స్పష్టమైంది. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2- ది రూల్లో నటిస్తోన్నాడు.
పాన్ ఇండియా మూవీ ఇది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. పుష్ప- ది రైజ్ పార్ట్ 1కు సీక్వెల్. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొంటోంది మూవీ. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, రష్మిక మందన్న, అనసూయ భరద్వాజ్, ప్రియమణి, సునీల్.. ఇతర కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. సుకుమార్ దర్శకుడు.
సుమారు 500 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతోంది ఈ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్నాయి. వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంది. శుక్రవారం డేవిడ్ వార్నర్ బర్త్‌డే కాగా.. అల్లు అర్జున్ అతనికి విషెస్ కూడా తెలిపిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications