సూపర్ సండే: కొదమ సింహాల పోరు
సిమ్లా: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టుగా నిలిచారు బ్లాక్ క్యాప్స్. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించారు. న్యూజిలాండ్ తరువాత భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. నాలుగు విజయాలు- ఎనిమిది పాయింట్లు టీమిండియా ఖాతాలో ఉన్నాయి.
తన తదుపరి మ్యాచ్ ఆడబోతోంది టీమిండియా. న్యూజిలాండ్‌ను ఎదుర్కొనబోతోంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల స్టేడియంలో ఈ పోరు ఆరంభమౌతుంది. ఈ రెండు జట్లకూ ఇది అయిదో మ్యాచ్. ఓటమి అనేది ఎరుగవు ఈ రెండు జట్లు కూడా.

వరల్డ్ కప్ 2023లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లనూ గెలిచాయి. చెరో ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టిలో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. నెట్ రన్‌రేట్ ఆధారంగా భారత్ రెండోస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా మూడో స్థానంలో కొనసాగుతోంది.
ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ను ఓడించింది న్యూజిలాండ్. ఆయా మ్యాచ్‌లన్నీ కూడా ఏకపక్షంగా సాగాయి. టీమిండియాదీ అదే పరిస్థితి. ఆస్ట్రేలియాను మట్టికరిపించడంతో మొదలైంది రోహిత్ సేన జైత్రయాత్ర. బ్రేకుల్లేకుండా సాగుతోంది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై తిరుగులేని విజయాలను అందుకుంది.
ఇప్పటివరకు ఓటమి అనేది తెలియని జట్లు ఏవైనా ఉన్నాయంటే అది భారత్, న్యూజిలాండ్. టేబుల్ టాపర్స్ మధ్య మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ధర్మశాల స్టేడియంలో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవరు ఓడినా.. ఆ జట్టుకు తొలి ఓటమి అవుతుంది.
టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకోవడానికే మొగ్గు చూపొచ్చు కేప్టన్ రోహిత్ శర్మ. ఇప్పటివరకు సాధించిన ఈ నాలుగు విజయాలు కూడా సెకెండ్ ఇన్నింగ్‌లో నమోదైనవే. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాంఛి కాక మీద ఉన్నారు. పోటీ పడి మరీ సెంచరీలు బాదుతున్నారు. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. వారికి ఏ మాత్రం తీసిపోవట్లేదు. లేట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. ట్రాక్ ఎక్కాడు.
న్యూజిలాండ్ బ్యాటర్లు కూడా సమష్ఠిగా రాణిస్తోన్నారు. బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంటోంది. టీమిండియా తరహాలోనే ఆ జట్టులో కూడా సెంచరీలు నమోదయ్యాయి. డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, మిఛెల్ శాంట్నర్, మార్క్ ఛాప్‌మన్, డారిల్ మిఛెల్.. ఇలా ఆ జట్టు ప్లేయర్లందరూ సత్తా చాటుతున్నారు. అలాంటి ఈ రెండు జట్లు పోటీ అంటే- కొదమసింహాల పోరును తలపించడం ఖాయం.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్












Click it and Unblock the Notifications