కోహ్లీకి కొత్తేమీ కాదు- ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ..!!
సిమ్లా: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. టీమిండియా ముందు చెతులెత్తేసింది. వరుసగా నాలుగు విజయాలను సాధించిన కివీస్.. భారత్ ముందు మోకరిల్లింది. బలమైన రోహిత్ సేనను కట్టడి చేయడానికి బ్లాక్ క్యాప్స్ పన్నిన వ్యూహాలేవీ ఫలించలేదు.
టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లల్లో 273 పరుగులకు ఆలౌట్ అయింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర- 75, డారిల్ మిఛెల్- 130 పరుగులతో సత్తా చాటారు. కివీస్ ఇన్నింగ్‌లో వారిద్దరిదే భారీ స్కోర్. లేట్‌గా వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ఎంట్రీ ఇచ్చిన మహ్మద్ షమీ అయిదు వికెట్లతో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు.

274 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్ ఆరంభింంచిన భారత్.. మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్.. స్కోర్ బోర్డ్‌ను పరుగులెత్తించారు. వారిద్దరూ వెంటవెంటనే అవుట్ అయినప్పటికీ.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం రాలేదు.
విరాట్ కోహ్లీ మరోసారి భారీ ఇన్నింగ్ ఆడాడు. 95 పరుగులతో చెలరేగాడు. 104 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు భారీ సిక్సర్లు బాదాడు. మాట్ హెన్రీ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు కోహ్లీ. హెన్రీ వేసిన బంతిని మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. బంతి బ్యాట్ అంచులను తాకి గాల్లోకి లేచిన బంతి.. ఫిలిప్స్ చేతుల్లో వాలింది.
అయిదు పరుగుల తేడాతో సెంచరీ మిస్ కావడం అభిమానులను నిరాశ పరిచింది. ఇలా 90ల్లో అవుట్ కావడం విరాట్ కోహ్లీకి కొత్తేమీ కాదు. అతని కేరీర్‌లో ఇప్పటివరకు ఆడిన ఇంటర్నేషనల్ మ్యాచ్‌లల్లో చాలాసార్లు ఇలా 90ల్లో వెనుదిరిగాడు. ఇందులో వన్డే ఇంటర్నేషనల్స్, టెస్ట్ ఫార్మట్ మ్యాచ్‌లూ ఉన్నాయి.
అతని కేరీర్ మొత్తమమీద ఎనిమిదిసార్లు 90ల్లో అవుట్ అయ్యాడు కోహ్లీ. ఇందులో ఆరుసార్లు మొత్తంగా వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లు ఉన్నాయి. టెస్ట్ మ్యాచ్‌లల్లో రెండుసార్లు 90 దాటిన తరువాత వికెట‌్‌ను పారేసుకున్నాడు. ఇలా అవుట్ కాకపోయి ఉంటే అతని సెంచరీల సంఖ్య మరింత పెరిగేది. అన్ని ఫార్మట్లల్లో కలిపి 78 సెంచరీలు కొట్టాడు కోహ్లీ.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications