పాకిస్తాన్‌కు లాస్ట్ ఛాన్స్- నేడు కీలక మ్యాచ్..!!
చెన్నై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. టీమిండియా ముందు చెతులెత్తేసింది. వరుసగా నాలుగు విజయాలను సాధించిన కివీస్.. భారత్ ముందు మోకరిల్లింది. బలమైన రోహిత్ సేనను కట్టడి చేయడానికి బ్లాక్ క్యాప్స్ పన్నిన వ్యూహాలేవీ ఫలించలేదు.
టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లల్లో 273 పరుగులకు ఆలౌట్ అయింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర- 75, డారిల్ మిఛెల్- 130 పరుగులతో సత్తా చాటారు. కివీస్ ఇన్నింగ్‌లో వారిద్దరిదే భారీ స్కోర్. లేట్‌గా వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ఎంట్రీ ఇచ్చిన మహ్మద్ షమీ అయిదు వికెట్లతో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు.

274 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్ ఆరంభింంచిన భారత్.. మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్.. స్కోర్ బోర్డ్‌ను పరుగులెత్తించారు. విరాట్ కోహ్లీ మరోసారి భారీ ఇన్నింగ్ ఆడాడు. 95 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా రాణించడంతో 48 ఓవర్లలోనే భారత్ విజయాన్ని అందుకుంది.
వరల్డ్ కప్ 2023లో భాగంగా నేడు పాకిస్తాన్ కీలక మ్యాచ్ ఆడబోతోంది. ఆప్ఘనిస్తాన్‌తో తలపడనుంది. చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి వేదిక. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లను ఆడిన బాబర్ ఆజమ్ టీమ్.. రెండింట్లో నెగ్గింది. నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో కొనసాగుతోంది. సెమీ ఫైనల్స్ రేసులో నిల్చోవాలంటే ఈ మ్యాచ్‌ను గెలిచి తీరాల్సి ఉంటుంది పాకిస్తాన్‌కు.
ఆఫ్ఘనిస్తాన్‌పై విజయం సాధిస్తే ఆరు పాయింట్లతో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంటుంది. ఇందులో ఓడిపోతే- ఇక మళ్లీ ఆ జట్టు కోలుకోవడం దాదాపుగా అసాధ్యమే అవుతుంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లలో మూడు జట్లు బలమైనవే. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లను ఢీ కొట్టాల్సి ఉంటుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయా జట్లపై గెలవాలంటే పాకిస్తాన్ చెమటోడ్చక తప్పదు. ఏ మాత్రం తేడా కొట్టినా సెమీస్ రేసు నుంచి తప్పుకోవాల్సి రావడం ఖాయం. ఆఫ్ఘనిస్తాన్‌పై భారీ రన్‌రేట్‌తో నెగ్గడానికి వ్యూహాలను రూపొందించుకుందా జట్టు. తుదిజట్టులో కీలక మార్పులు చేసే అవకాశాలు లేకపోలేదు.
ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. నాలుగు మ్యాచ్‌లను ఆడిన ఆ జట్టు గెలిచింది ఒక్కటే. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను మట్టికరిపించిందా జట్టు. అదే ఊపును మళ్లీ కొనసాగించలేకపోయింది. తన నాలుగో మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది.
పాకిస్తాన్ తుదిజట్టులో- బాబర్ అజామ్ (కేప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సవూద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హ్యారీస్ రవూఫ్, హసన్ అలీ, షహీన్ షా ఆఫ్రిది, మహ్మద్ వసీం ఆడొచ్చు.
ఆఫ్ఘనిస్తాన్ తుదిజట్టులో- హష్మతుల్లా షాహిదీ (కేప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూఖీ, అబ్దుల్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్ ఆడొచ్చు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications