టీ20లో టీమిండియా బౌలర్లు అట్టర్ ఫ్లాప్- భారీ టార్గెట్: న్యూజిలాండ్ బ్యాటర్ తుఫాన్ ఇన్నింగ్
వెల్లింగ్టన్ స్టేడియంలో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజృంభించింది. తడాఖా చూపింది. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణయానికి భిన్నంగా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేశారు బ్యాటర్లు. భారత్ ముందు 199 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచారు. మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
ఇన్నింగ్ ఆరంభంలోనే ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ వికెట్ ను కోల్పోయింది న్యూజిలాండ్. రెండు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. సీఫెర్ట్ వికెట్ ను పడగొట్టి భారత్ శుభారంభం చేసింది గానీ అది ఎంతో సేపు నిలవలేదు. ఆ తర్వాత ఫిన్ అలెన్ చెలరేగాడు. 25 బంతుల్లో 5 సిక్సర్లతో 40 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో అలెన్ అవుటైనప్పటికీ.. నెట్ రన్ రేట్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.

భారీ స్కోర్ సాధించాల్సిన బాధ్యతను డారిల్ మిచెల్ భుజాన వేసుకున్నాడు. మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ భారత బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడీ స్టార్ బ్యాటర్. 52 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 89 పరుగులు చేసి న్యూజిలాండ్ బ్యాటింగ్ కు వెన్నుముకగా నిలిచాడు. అతనికి తోడుగా చివరి వరకూ క్రీజ్ లో నిలిచాడు బెవాన్ జాకబ్స్. అతను కూడా మెరుపులు మెరిపించాడు. 23 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 39 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
వీరిద్దరి భాగస్వామ్యంతో న్యూజిలాండ్ ఆఖరి ఓవర్లలో భారీగా పరుగులు రాబట్టుకుంది. రన్ రేట్‌ను 9.9కి చేర్చింది. టీమిండియా బౌలింగ్ లైనప్ మరోసారి నిరాశపరిచింది. అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి ఒక్కో వికెట్ తీసుకున్నప్పటికీ.. పరుగులను నియంత్రించడంలో విఫలం అయ్యారు. పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి ఫ్లాప్ షో కనపర్చాడు. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడ. నాలుగు ఓవర్లల్లో 40 పరుగులు ఇచ్చుకున్నాడు. ప్రిన్స్ యాదవ్ దీ అదే పరిస్థితి. 4 ఓవర్లలో 44 పరుగులు సమర్పించుకున్నాడు.













Click it and Unblock the Notifications
