డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం: కొత్త ఏడాది వేళ.. ఫ్యాన్స్‌కు షాక్
David Warner: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే ఇంటర్నేషనల్స్ ఫార్మట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్ట్ మ్యాచ్‌లకూ గుడ్ బై చెప్పాడు. ఈ రెండు ఫార్మట్ల నుంచి తప్పుకొంటోన్నట్లు ప్రకటించాడు. 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అందుబాటులో ఉంటానని తెలిపాడు. తన అవసరం ఉందనుకుంటే ఈ టోర్నమెంట్‌లో ఆడతానని పేర్కొన్నాడు.
ఐసీసీ వరల్డ్ కప్ 2023 కప్‌ను గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు డేవిడ్ వార్నర్. జట్టు తరఫున అత్యధిక స్కోర్ సాధించిన ప్లేయర్ అతనే. ఈ టోర్నమెంట్‌లో 510 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి. వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో 500లకు పైగా పరుగులు చేసిన మూడో ఆస్ట్రేలియన్ బ్యాటర్.. డేవిడ్ వార్నర్.

వన్డే ఇంటర్నేషనల్స్, టెస్ట్ ఫార్మట్ నుంచి తప్పుకొన్న తరువాత కుటుంబంతో అధిక సమయాన్ని కేటాయిస్తానని డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు. కుటుంబ సభ్యుల కోసం సమయాన్ని కేటాయించాల్సిన అవసరం వచ్చిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించాడు.
టీ20 ఇంటర్నేషనల్స్‌లో కొనసాగుతానని తెలిపాడు. అలాగే- 50 ఓవర్ల ఫార్మట్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం అందుబాటులో ఉంటానని చెప్పాడు వార్నర్. తన అవసరం ఉందని ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డ్ భావిస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే జట్టులో తనకు స్థానం కల్పించుకోవచ్చని సూచించాడు.

పాకిస్తాన్‌తో ఆడబోయే టెస్ట్ మ్యాచ్ డేవిడ్ వార్నర్‌కు చివరిదవుతుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్‌లో బుధవారం ఈ మ్యాచ్ మొదలవుతుంది. తన హోమ్ గ్రౌండ్‌లోనే చివరి టెస్ట్ మ్యాచ్ ఆడబోతోన్నాడు డేవిడ్ వార్నర్. ఇది అతని 112వ టెస్ట్ మ్యాచ్. ఇప్పటివరకు ఆడిన 111 టెస్టుల్లో 8,695 పరుగులు చేవాడు. ఇందులో 26 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ యావరేజ్.. 44.58.
వన్డేల్లో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు వార్నర్. ఇప్పటివరకు 161 వన్డేలను ఆడాడు. 6,932 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు ఉన్నాయి. 45.30 బ్యాటింగ్ యావరేజ్‌ను నమోదు చేశాడీ డాషింగ్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్.












Click it and Unblock the Notifications