క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియన్ స్టార్

David Warner: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. క్రికెట్ నుంచి తప్పుకొంటోన్నట్లు ప్రకటించాడు. 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అందుబాటులో ఉంటానని తెలిపాడు. తన అవసరం ఉందనుకుంటే ఈ టోర్నమెంట్‌లో ఆడతానని పేర్కొన్నాడు.

ఐసీసీ వరల్డ్ కప్ 2023 కప్‌ను గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు డేవిడ్ వార్నర్. జట్టు తరఫున అత్యధిక స్కోర్ సాధించిన ప్లేయర్ అతనే. ఈ టోర్నమెంట్‌లో 510 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి. వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో 500లకు పైగా పరుగులు చేసిన మూడో ఆస్ట్రేలియన్ బ్యాటర్.. డేవిడ్ వార్నర్.

David Warner has retired from international cricket mostly available for Champion s Trophy

ఇదివరకే వన్డే ఇంటర్నేషనల్స్, టెస్ట్ ఫార్మట్ నుంచి వార్నర్ తప్పుకొన్న విషయం తెలిసిందే. తాజాగా టీ20 ఇంటర్నేషనల్స్‌కూ గుడ్ బై చెప్పాడు. రిటైర్మెంట్ తరువాత జీవితాన్ని కుటుంబం కోసం కేటాయిస్తానని డేవిడ్ వార్నర్ చెప్పాడు. కుటుంబ సభ్యుల కోసం సమయాన్ని కేటాయించాల్సిన అవసరం వచ్చిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించాడు.

టీ20 ఫార్మట్‌లో ఇంకొంతకాలం కొనసాగాలని వార్నర్ భావించినప్పటికీ- అది సాధ్యపడలేదు. టీ20 వరల్డ్ కప్ 2024లో సూపర్ 8 దశలోనే ఆస్ట్రేలియా వెనుదిరిగిన ప్రభావం అతనిపై పడినట్టు కనిపించింది. ఆఫ్ఘనిస్తాన్, భారత్ చేతిలో బ్యాక్ అండ్ బ్యాక్ మ్యాచ్‌లల్లో ఓటమి పాలు కావడం వార్నర్‌ను తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునేలా చేసింది.

ఈ టోర్నమెంట్‌లో అతను ఆశించిన స్థాయిలో ఆడలేదు. 50 ఓవర్ల ఫార్మట్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం అందుబాటులో ఉంటానని చెప్పాడు వార్నర్. తన అవసరం ఉందని ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డ్ భావిస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే జట్టులో తనకు స్థానం కల్పించుకోవచ్చని సూచించాడు.

112వ టెస్ట్ మ్యాచ్‌లను ఆడాడు వార్నర్. 8,786 పరుగులు చేవాడు. ఇందులో 26 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ యావరేజ్.. 44.58. అత్యధిక వ్యక్తిగత పరుగులు 335 (నాటౌట్).

వన్డేల్లో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు వార్నర్. ఇప్పటివరకు 161 వన్డేలను ఆడాడు. 6,932 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు ఉన్నాయి. 45.30 బ్యాటింగ్ యావరేజ్‌ను నమోదు చేశాడీ డాషింగ్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్. టీ20 ఇంటర్నేషనల్స్‌లో అదరగొట్టాడు. 110 మ్యాచ్‌లల్లో 3,277 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+