IPL 2025: అక్షర్ చేతికి ఢిల్లీ పగ్గాలు - ఏ జట్టు కెప్టెన్ ఎవరు..!!

IPL 2025: ఐపీఎల్ సమరానికి సర్వం సమాయత్తం అవుతోంది. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు పోరాటానికి సిద్దం అవుతున్నాయి. ఐపీఎల్ కు ఈ సీజన్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పలు జట్లలో కీలక మార్పులు జరిగాయి. జట్ల కెప్టెన్లు మారిపోయారు. హోరా హోరాగా ఐపీఎల్ సమరం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, కొద్ది రోజులుగా సస్పెన్స్ గా మారిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ను అధికారికంగా ప్రకటించారు. ఆల్ రౌండర్ అక్షర్ కు జట్టు నాయకత్వ బాధ్యతలు ఖరారు చేసారు.

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్
ఢిల్లీ క్యాపిటల్స్ తమ కొత్త కెప్టెన్‌ని ప్రకటించింది. అందరూ ఊహాంచినట్లుగానే ఐపీఎల్ 2025 ఢిల్లీ కెప్టెన్ గా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ వ్యవమరించనున్నారు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆల్ రౌండర్ అక్షర్ పటేలా సక్సెస్ ఫుల్ గా రాణించారు. కీలక మ్యాచుల్లో టీం ఇండియాను విజయ తీరాలకు చేర్చారు. దీంతో ఢిల్లీ ఫ్రాంఛైజీ అక్షర్ కే సారథ్య బాధ్యతలను కట్టబెట్టింది. 2025 ఐపీఎల్ ఆడుతున్న 10 జట్లలో 9 జట్లు ఇప్పటికే తమ కెప్టెన్ల పేర్లను ప్రకటించాయి. ఇప్పటి వరకు ఢిల్లీ మాత్రమే తమ కెప్టెన్ ను ప్రకటించలేదు. తాజాగా అక్షర్ పటేల్ ను ఖరారు చేయటంతో అన్ని జట్ల కెప్టెన్ల పైన స్పష్టత వచ్చింది.

Delhi Capitals have named Axar Patel as their new skipper for the IPL 2025

అక్షర్ కు బాధ్యతలు
ఢిల్లీ క్యాపిటల్స్ లో ముందుగా కేఎల్ రాహుల్ పేరు కెప్టెన్ గా ప్రతిపాదన వచ్చింది. అయితే, రాహుల్ సతీమణి అతియా శెట్టి గర్భం దాల్చడం వల్ల రాహుల్ వైజాగ్ లో జరిగే మ్యాచ్ లకు దూరం కానున్నాడు. దీంతో.. జట్టు యాజమాన్యం అక్షర్ వైపు మొగ్గు చూపింది. పటేల్ 2019 నుంచి ఢిల్లీ తరఫున ఆడుతున్నారు. అక్షర్ పటేల్ ఇప్పటివరకు150 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 131 స్ట్రైక్ రేట్‌తో 1653 పరుగులు చేశాడు.7.28 ఎకానమీ రేట్‌తో 123 వికెట్లు పడగొట్టాడు. తనకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించటం పైన స్పందించిన అక్షర్ తాను ఈ బాధ్యతలను గౌరవం గా భావిస్తానని చెప్పారు. తన పైన ఉంచి నమ్మకం నిలబెట్టుకొనేలా టీం విజయం కోసం పని చేస్తానని వెల్లడించారు.

టీంలు - కెప్టెన్లు
దీంతో, ఆల్ రౌండర్ గా గ్రౌండ్ లో రాణిస్తున్న అక్షర్ కెప్టెన్ గా ఎలా రాణిస్తాడననేది క్రికెట్ ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ను ప్రకటించటంతో అన్ని జట్ల కెప్టెన్లు ఖరారు అయ్యారు. ప్రస్తుత సీజన్ కు కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా అజింక్య రహానే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా రజత్ పాటిదార్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా పాట్ కమ్మిన్స్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ వ్యవహరించనున్నారు. ఇక.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రితు రాజ్ గైక్వాడ్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిష బ్ పంత్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా శుభ్‌మాన్ గిల్ ఉండగా.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+