ఇదే ఫైనల్ అనుకోండి- చివరి బెర్త్ కోసం హోరాహోరీ నాకౌట్
టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న కీలకమైన సూపర్ 8 పోరుకు భారత్ సిద్ధమవుతోంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్న ఈ మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టుకు డూ ఆర్ డైగా సమరంగా మారింది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. జింబాబ్వేపై భారీ విజయంతో సెమీఫైనల్ ఆశలు మొలకెత్తాయి. ఇప్పుడు సెమీఫైనల్ ఎంట్రీ పాస్ కోసం వెస్టిండీస్ తో తలపడాల్సి ఉంది. భారత్, వెస్టిండీస్ రెండూ దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయిన జట్లే.
ఇప్పటికే ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, తమ సెమీఫైనల్ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. శనివారం రాత్రి పల్లెకెలెలో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిచినప్పటికీ- నెట రన్ రేట్ సాధించకపోవడం వల్ల ఆ జట్టు కూడా సెమీస్ రేసు నుంచి తప్పుకొంది. దీంతో మెరుగైన నెట్ రన్ రేట్ ఉండటం వల్ల న్యూజిలాండ్ సెమీస్ కు అర్హత సాధించింది. దీంతో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా సరసన చేరింది న్యూజిలాండ్. ఈ ముడు జట్లూ సెమీస్ చేరాయి.

ఇక మిగిలింది ఒక్క బెర్త్ మాత్రమే. దీనికోసం భారత్, వెస్టిండీస్ తలపడుతున్నాయి. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీస్ లో అడుగు పెడుతుంది. ఎటువంటి నెట్ రన్ రేట్ల అవసరం ఉండదు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇక సెమీ ఫైనల్స్ ఆరంభమౌతాయి. 4వ తేదీన తొలి సెమీ ఫైనల్ కోల్ కత ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. ఆ మరుసటి రోజే ముంబై వాంఖెడే వేదికగా రెండో సెమీస్ ఉంటుంది. 8న ఫైనల్.
వెస్టిండీస్ తో జరిగే మ్యాచ్ లో బ్యాటింగ్ ఆర్డర్, ప్లేయింగ్ 11 లో మార్పులు అనివార్యం అయ్యాయి. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ వ్యూహాన్ని మార్చింది భారత్. అభిషేక్ శర్మకు ఓపెనింగ్ భాగస్వామిగా సంజు శాంసన్ దిగాడు. ఇషాన్ కిషన్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. ఈ మార్పు ఫలించింది. సంజు మెరుపు ఇన్నింగ్స్ ఆడినా, దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. అభిషేక్ శర్మ సంయమనంతో ఆడాడు.
బ్యాటింగ్ బాగున్నా, బౌలింగ్ ఆందోళనకరంగా పరిణమించింది. బౌలర్లు విఫలం కావడం వల్ల జింబాబ్వే కూడా భారత్ పై 180కి పైగా పరుగులు సాధించింది. వరుసగా మూడు మ్యాచ్‌లలో ఆల్‌రౌండర్ శివమ్ దూబే మీడియం పేస్‌ను ప్రత్యర్థులు స్వేచ్ఛగా ఎదుర్కొన్నారు. అతని బౌలింగ్ లోనే భారీగా పరుగులు పిండుకున్నారు.
వెస్టిండీస్ బ్యాటర్ల దూకుడు దృష్ట్యా కోల్‌కతాలో అతన్ని బౌలింగ్‌కు దించే విషయంలో ఆచితూచి వ్యవహరించక తప్పదు. నిలకడగా రాణించే వరుణ్ చక్రవర్తి కూడా గత రెండు మ్యాచ్‌లలో విఫలం అయ్యాడు. జింబాబ్వేపై అక్షర్ పటేల్‌ను తిరిగి జట్టులోకి తీసుకువచ్చినప్పటికీ అతను కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. రిస్ట్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ టోర్నీలో ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. అక్షర్ స్థానంలో కుల్‌దీప్‌ను తీసుకువస్తారా? లేదా దూబేను బెంచ్‌కే పరిమితం చేస్తారా? అనేది వేచి చూడాలి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications