క్రీడా రంగానికి షాక్: ఐదేళ్ల బంధానికి ముగింపు.. టెన్నిస్ స్టార్ జంట విడాకులు!
ఆటపాటలతో వెలిగిపోతూ, సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ కపుల్‌గా ఎందరికో ఆదర్శంగా నిలిచిన అంతర్జాతీయ టెన్నిస్ దిగ్గజాలు ఎలీనా స్విటోలినా, గేల్ మోన్‌ఫిల్స్ తమ ఐదేళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలికారు. దంపతులుగా విడిపోవడమే కాకుండా ఇద్దరూ ఒకేసారి తమ సుదీర్ఘ టెన్నిస్ కెరీర్‌కు ముగింపు పలికి రిటైర్మెంట్ ప్రకటించడం క్రీడా లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తలెత్తిన మానసిక ఆందోళనలు, వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన కలతలు ఈ ఊహించని నిర్ణయానికి కారణమయ్యాయి.
యుద్ధం మిగిల్చిన మనోవేదన.. ఎలీనా స్విటోలినా భావోద్వేగం
ఉక్రెయిన్ టెన్నిస్ స్టార్ ఎలీనా స్విటోలినా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. "రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నన్ను మానసికంగా తీవ్రంగా కుంగదీసింది. నిద్రలేని రాత్రులు, నాలో నేను కోల్పోతున్నాననే భావన నన్ను వేధించాయి. నన్ను నేను మళ్లీ కనుగొనాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఈ వివాహ బంధంలో ఉంటూ అది సాధ్యం కాదని గ్రహించాను. మోన్‌ఫిల్స్ నా పరిస్థితిని అర్థం చేసుకుని నా నిర్ణయాన్ని గౌరవించారు" అని ఎలీనా స్విటోలినా పేర్కొన్నారు. అయితే తాము విడిపోవడానికి ఒకరినొకరు నిందించుకోవడం లేదని, తమ కూతురు స్కైకి మంచి తల్లిదండ్రులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు.

కెరీర్‌కు ముగింపు పలికిన గేల్ మోన్‌ఫిల్స్
సతీమణి తీసుకున్న నిర్ణయం, కుటుంబంలో తలెత్తినన పరిస్థితులతో తీవ్ర మనోవేదనకు గురైన ఫ్రెంచ్ టెన్నిస్ క్రీడాకారుడు గేల్ మోన్‌ఫిల్స్ తక్షణమే ఆట నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి ఈ నెలాఖరులో జరగబోయే 'పారిస్ మాస్టర్స్' టోర్నీ తర్వాత రిటైర్ కావాలని భావించినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కెరీర్‌ను ముందే ముగించారు. 40 ఏళ్ల మోన్‌ఫిల్స్ తన కెరీర్లో 13 ఏటీపీ టైటిళ్లతో పాటు ప్రపంచ 6వ ర్యాంక్ సాధించారు.
రికార్డుల రాణి స్విటోలినా
30 ఏళ్ల ఎలీనా స్విటోలినా మహిళల టెన్నిస్‌లో తిరుగులేని క్రీడాకారిణిగా నిలిచారు. తన కెరీర్లో 17కి పైగా డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిళ్లను ముద్దాడిన ఎలీనా స్విటోలినా.. 2017లో ప్రపంచ 3వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. 2018 డబ్ల్యూటీఏ ఫైనల్స్ విజేతగా నిలవడమే కాకుండా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఉక్రెయిన్ తరఫున చారిత్రాత్మక కాంస్య పతకాన్ని సాధించి దేశ కీర్తిని చాటారు. ఓ వైపు అద్భుతమైన కెరీర్, మరోవైపు అందమైన కుటుంబం ఒకేసారి జ్ఞాపకాలుగా మారిపోవడం క్రీడాభిమానులను తీవ్ర విచారంలో ముంచెత్తింది.














Click it and Unblock the Notifications
