ఫుట్‌బాల్ స్టార్‌కి రూ.8 వేల కోట్లు ఆస్తి రాసిచ్చిన ఫ్యాన్..!
బ్రెజిల్ ఫుట్‌బాల్ సూపర్ స్టార్ నెయ్‌మార్ జీవితంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. రియో గ్రాండే డో సుల్‌కు చెందిన 31 ఏళ్ల వ్యాపారవేత్త ఒకరు మరణానికి ముందు తన మొత్తం ఆస్తిని నెయ్‌మార్‌కే చెందేలా వీలునామా రాశారు. అతని ఆస్తి విలువ సుమారు 752 మిలియన్ పౌండ్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.8,000 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అసలు కారణం అదే..!
ఈ ఏడాది జూన్‌లో నోటరీ కార్యాలయంలో వీలునామాను నమోదు చేశారు. అందులో.. సంతానం లేని ఆ బిలియనీర్ తన వీలునామాలో స్పష్టంగా "నాకు నెయ్‌మార్ అంటే చాలా ఇష్టం. అతనితో నన్ను నేను పోల్చుకుంటాను. అతను స్వార్థపరుడు కాదు. ఈ రోజుల్లో అలాంటి వారు అరుదు" అని రాశారు. అలానే నెయ్‌మార్ కు తన తండ్రితో ఉన్న అనుబంధం.. తనకు తన దివంగత తండ్రితో ఉన్న బంధాన్ని గుర్తు చేసిందని కూడా పేర్కొన్నారు. తాను పూర్తిగా స్పృహతో, ఎవరూ ఒత్తిడి చేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రికార్డు చేశారు.

ప్రస్తుతం ఈ వీలునామా బ్రెజిల్ కోర్టు సమీక్షలో ఉంది. న్యాయస్థానం ఆమోదం తెలిపిన తర్వాతే నెయ్‌మార్ ఆస్తిని స్వీకరించగలడని వెల్లడిస్తున్నారు. ఈ ప్రక్రియలో పన్నులు విధించే అవకాశముందని అంటున్నారు. వారసత్వం లేని సందర్భంలో, ఇతర బంధువులు లేదా సంస్థలు కూడా సవాళ్లు చేయవచ్చని.. కొన్ని చట్టపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నప్పటికీ, వీలునామా సక్రమంగా రిజిస్టర్ అయినందువల్ల నెయ్‌మార్‌కు అనుకూల తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.
నెయ్‌మార్ ఇప్పటికే ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రీడాకారుల్లో ఒకరుగా ఉన్నారు. ఆయన ఆస్తి విలువ సుమారు 846 మిలియన్ పౌండ్లు (దాదాపు ₹8,800 కోట్లు) వరకు ఉంటుంది. 2024లో సౌదీ అరేబియాలోని అల్-హిలాల్ క్లబ్తో ఒప్పందం ద్వారా 90.7 మిలియన్ పౌండ్లు (దాదాపు ₹950 కోట్లు) సంపాదించారు. ఫుట్‌బాల్ క్లబ్‌లతో పాటు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, స్పాన్సర్‌షిప్స్ ద్వారా కూడా వందల కోట్ల ఆదాయం పొందుతున్నారు.
తన కెరీర్‌లో బార్సిలోనా, పారిస్ సెయింట్ జర్మైన్ (PSG) వంటి అగ్రశ్రేణి క్లబ్‌లకు నెయ్‌మార్ ప్రాతినిధ్యం వహించారు. ఇటీవలే తన చిన్ననాటి క్లబ్ శాంటోస్ FCకు తిరిగి వచ్చి బ్రెజిలియన్ అభిమానులను ఆనందపరిచారు. 2026 ఫిఫా ప్రపంచకప్‌లో బ్రెజిల్ తరఫున ఆడటం లక్ష్యంగా ఉన్నారు. అయితే ఈ ఘటనపై నెయ్‌మార్ ఇంకా రెస్పాండ్ అవ్వలేదని తెలుస్తోంది.
మరోవైపు 62 ఏళ్ల నిషా పాటిల్ అనే మహిళ తన మరణానంతరం రూ.72 కోట్ల విలువైన ఆస్తిని బాలీవుడ్ హీరో సంజయ్ దత్ పేరు మీద వీలునామా రాశారు. ఆమె చనిపోయిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వార్త విన్న సంజయ్ దత్ వెంటనే న్యాయవాదులను సంప్రదించి ఆ ఆస్తిను ఆమె కుటుంబానికి తిరిగి అందజేశారు. ఆమె ప్రేమ ఎంతో గొప్పదని.. కానీ ఆ హక్కు ఆమె కుటుంబానిదేనని చెప్పుకొచ్చారు.
-
"'ధురంధర్' సినిమానే కాదు.. ప్రభుత్వానికి రాసిన ప్రేమలేఖ" -
రెహ్మాన్ డకైత్ వర్సెస్ మేజర్ ఇక్బాల్.. అసలైన విలన్ ఎవరు? -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications