Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IND Vs AUS: ఆసీస్ వద్దనుకున్నదే అవుతోంది- నో డౌట్, కప్‌ మనదే..!!

మళ్లీ మళ్లీ రాని రోజు ఇది. జీవిత కాల ఆశ ఇది. రోహిత్ మరోసారి చెలరేగు. విరాట్ మరోసారి నిలబడు. షమీ బంతితో విన్యాసాలు కొనసాగించు. మొత్తంగా టీమిండియా గ్రౌండ్ లో మరోసారి చెలరేగాలి. ఇదీ ప్రతీ భారతీయుడు కోరుకుంటున్న మాట. ప్రపంచ కప్ ఫీవర్ తో దేశం ఊగిపోతోంది. కోట్లాది మంది ఫ్యాన్స్ రోహిత్ సేన కప్ గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇప్పుడు నడింపిచాల్సింది..గెలిపించే బాధ్యత రోహిత్ పైన ఉంది. ఆసీస్ ఏదైతే వద్దనుకుందో ఇప్పుడు అదే జరుగుతోంది.

అపూర్వ అవకాశం: భారత టీంకు వచ్చిన అపూర్వ అవకాశం. కపిల్‌ డెవిల్స్‌ పోరాటాన్ని మరిపిస్తూ.. ధోనీసేన చిరస్మరణీయ విజయాన్ని గుర్తుచేస్తూ.. ముచ్చటగా మూడో కప్‌తో సువర్ణాధ్యాయాన్ని లిఖించేందుకు దక్కిన అరుదైన సందర్భం. సొంతగడ్డపై అభిమానులు ఇచ్చే ప్రోత్సాహాన్ని ఆసరా చేసుకుని, దెబ్బతిన్న బెబ్బులిలా రోహిత్‌ సేన కంగారూలపై విరుచుకుపడడమే ఇక మిగిలింది.

Fans are eagerly awaiting Sundays big clash. Will Team India fulfil the expectations

రోహిత్‌, గిల్‌, విరాట్‌, శ్రేయాస్‌, రాహుల్‌ల టాప్‌ బ్యాటింగ్‌.. షమి, బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌ల సూపర్‌ బౌలింగ్‌ అండతో టీమిండియా ఇచ్చే చివరి పంచ్‌.. ఆసీస్‌కు అబ్బా అనిపించేలా ఉండాలని, తద్వారా మన జట్టు చాంపియన్‌గా నిలవాలని కోట్లాది భారతీయుల ఆకాంక్ష. ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయలేం. ఏమీ లేదనే స్థితి నుంచి విజేతగా నిలిచే సామర్థ్యం వారి సొంతం. టైటిల్‌ గేమ్స్‌లో ఉండే ఒత్తిడిని తట్టుకుని చాంపియన్స్‌గా మారడం వారికి అలవాటే.

భారత్‌కే మద్దతు: కానీ ప్రపంచంలోనే అతి భారీ క్రికెట్‌ స్టేడియంలో గంపగుత్తగా భారత్‌కే మద్దతు లభించే వేళ.. ఆసీస్‌ పోరాటం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరం. టీం కూర్పు నుంచి టాస్.. పిచ్ కండీషన్లకు అనుగుణంగా వ్యూహాల మార్పు రోహిత్ సమర్ధతకు పరీక్షగా మారుతోంది. అంతే కాదు..ఆరంభం మిచిల్ స్టార్క్ ను రోహిత్ ఒక ఆట ఆడుకుంటేనే భారత్ కు శుభారంభం. అదే జరిగితే పరుగులకు ఢోకా లేదు. మిగిలిన పని గిల్, కోహ్లీ, అయ్యర్, రాహుల్ పూర్తి చేస్తారు.

ఇక, తాజా వరల్డ్‌కప్‌లో భారత బౌలర్లు పది మ్యాచ్‌ల్లో కలిపి 95 వికెట్లు తీశారు. గతంలో ఆసీస్‌ జట్టు మాత్రమే సింగిల్‌ టోర్నీలో మనకన్నా ఎక్కువ తీసింది. 2007 టోర్నీలో 97.. 2003లో 96 వికెట్లు పడగొట్టింది. అలాగే ఈ రెండు సందర్భాల్లో ఆసీస్‌ జట్టు వరుసగా 11 మ్యాచ్‌లు గెలిచి కప్‌ను ఎగరేసుకుపోయింది. మరిప్పుడు భారత జట్టు పది విజయాలతో ఉంది. ఒకే టోర్నీలో ఎక్కువ వికెట్లు తీసిన ఘనత ఎలాగూ జట్టు ఖాతాలోనే చేరనుంది. ఇక 11వ విజయమే మిగిలి ఉంది. అదే జరిగితే మూడోసారి కప్‌ దక్కినట్టే.

హ్యాట్రిక్ విజయం ఖాయమేనా: వన్డేల్లో ఆస్ర్టేలియాపై విరాట్‌ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. తానాడిన 46 ఇన్నింగ్స్‌లో విరాట్‌ 53.79 సగటుతో 2313 పరుగులు చేశాడు. వీటిలో 13 హాఫ్‌ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి. స్ట్రయిక్‌ రేట్‌ 94.22. ఇక వరల్డ్‌కప్‌లను గమనిస్తే...కోహ్లీ ఆసీస్‌పై నాలుగు మ్యాచ్‌లాడి 192 రన్స్‌ చేశాడు. వరల్డ్‌కప్‌ల్లో ఆసీస్‌పై భారత్‌ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు కోహ్లీయే. వరల్డ్‌కప్‌ గెలవాలంటే ఏ జట్టు తమకు ఫైనల్‌ ప్రత్యర్థి కాకూడదని ఆస్ట్రేలియా కోరుకుందో...అదే భారత జట్టు తుదిపోరుకు చేరుకుంది.

భారత జట్టును చూసి ఆసీస్‌ భయపడుతోందని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు. అహ్మదాబాద్‌లో పిచ్‌ ప్రభావం మ్యాచ్‌ ఫలితంపై పెద్దగా ఉండదన్నాడు. మంచు ప్రభావం కీలకమవుతుంది. ఈ టోర్నీలో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిని ఛేజింగ్‌ జట్లే గెలిచాయి. ఈ ఫైనల్‌ నల్లమట్టి పిచ్‌పై జరుగనుంది. దీంతో బంతి తక్కువ బౌన్స్‌ అవడంతో పాటు చక్కటి టర్న్‌ లభించనుంది. తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 251 మాత్రమే. వేడి ఉష్ణోగ్రత ఉండడంతో వర్షానికి చాన్స్‌ లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+