పాక్.. చచ్చీ చెడి ఒక్కటి- గల్లీ క్రికెటర్ల కంటే అధ్వాన్నంగా తయారయ్యారేంట్రా

బంగ్లాదేశ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో పాకిస్తాన్ ఎట్టకేలకు విజయం సాధించింది. చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఓడించింది. ఏకంగా 74 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయం పాకిస్తాన్ కు ఊరట మాత్రమే. ఇప్పటికే టీ20 సిరీస్ ను కోల్పోయిందా జట్టు. తొలి రెండు మ్యాచ్ లల్లో ఓటమి చవి చూసింది. 1-2 ఆధిక్యతతో సిరీస్ ను ధారదాత్తం చేసింది.

గురువారం రాత్రి మిర్ పూర్ లో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగింది పాకిస్తాన్. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. షాహిబ్జాదా ఫర్హాన్ టాప్ స్కోరర్. 41 బంతుల్లో ఆరు ఫోర్లు, అయిదు సిక్సర్లతో చెలరేగాడు. 63 పరుగులు చేశాడు.

Farhan shines as Pakistan won by 74 runs runs against Bangladesh in 3rd T20I

మరో ఓపెనర్ సయీమ్ అయూబ్- 21, మహ్మద్ హ్యారిస్- 5, హసన్ నవాజ్- 33, కేప్టెన్ సల్మాన్ ఆఘా- 12 (నాటౌట్), హుస్సేన్ తలట్- 1, మహ్మద్ నవాజ్- 27, ఫహీమ్ అష్రాఫ్- 4, అబ్బాస్ అఫ్రిది- 7 (నాటౌట్)గా నిలిచారు. బంగ్లా బౌలర్లల్లో తస్కిన్ అహ్మద్- 3, నసుమ్ అహ్మద్- 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ఏ మాత్రం పోరాట పటిమ ప్రదర్శించలేకపోయింది. చేతులెత్తేసింది. పాకిస్తాన్ బౌలర్ల ధాటికి 16.4 ఓవర్లల్లోనే కుప్పకూలింది. 104 పరుగులు మాత్రమే చేయగలిగింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్ మహ్మద్ సైఫుద్దీన్ ఒక్కడే 35 పరుగులు చేయగలిగాడు. నాటౌట్ గా నిలిచాడు.

ఓపెనర్లు తన్జిద్ అహ్మద్- 0, మహ్మద్ నయీం- 10, కేప్టెన్ లిట్టన్ దాస్- 8, మెహదీ హసన్ రజా- 10, జకెర్ అలీ- 1, మెహదీ హసన్- 0, షమీమ్ హొస్సైన్- 5, నాసుమ్ అహ్మద్- 13, తస్కిన్ అహ్మద్- 7, షొరిఫుల్ ఇస్లాం- 7 పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లు సమష్టిగా రాణించారు. సల్మాన్ మిర్జా- 3, ఫమీమ్ అష్రాఫ్- 2, మహ్మద్ నవాజ్- 2, అహ్మద్ డేనియల్- 1, సల్మాన్ ఆఘా- 1, హుస్సైన్ తలట్ ఒక వికెట్ పడగొట్టారు.

ఈ సిరీస్ తో బంగ్లాదేశ్ రికార్డు నెలకొల్పింది. సుదీర్ఘ విరామం అనంతరం పాకిస్తాన్ పై టీ20 సిరీస్ ను గెలిచింది. ఇంకో మ్యాచ్ మిగిలివుండగానే.. 2-0 తేడాతో జయకేతనాన్ని ఎగురవేసింది. టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్ ఓటమితో ఓ చెత్త రికార్డును నెలకొల్పింది పాకిస్తాన్.

ఇప్పటివరకు ఆడిన 32 టీ20 ఇంటర్నేషనల్స్ లో ఆ జట్టు గెలిచింది.. తొమ్మిది మాత్రమే. 23 మ్యాచ్ లల్లో ఘోరంగా ఓటమి చవి చూసింది. ఆ గెలిచిన మ్యాచ్ లు కూడా ఐర్లాండ్, జింబాబ్వే, కెనడా వంటి పసికూనల మీదే. ఐర్లాండ్-2, జింబాబ్వే-2, కెనడాపై ఒక మ్యాచ్ తో పాటు న్యూజిలాండ్ పై ఇంకో గేమ్ లో విజయం సాధించింది. ఇప్పుడు బంగ్లాపై గెలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+