Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్‌సీబీ!

ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ సీఎస్‌కే ఓటమిపాలైంది. ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) 43 పరుగుల తేడాతో సీఎస్‌కే‌ను చిత్తు చేసింది.

టీమ్ డేవిడ్(25 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 70 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో చెన్నై పతనాన్ని శాసించాడు. మరోసారి సీఎస్‌కే బౌలర్లు, టాపార్డర్ బ్యాటర్లు చేతులెత్తేసారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమ్ డేవిడ్‌తో పాటు దేవదత్ పడిక్కల్(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీ రాణించాడు. రజత్ పటీదార్(19 బంతుల్లో ఫోర్, 6 సిక్స్‌లతో 48 నాటౌట్), ఫిల్ సాల్ట్(30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), విరాట్ కోహ్లీ(18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 28) విలువైన పరుగులు జోడించారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో అన్షుల్ కంబోజ్, జెమీ ఓవర్టన్, శివమ్ దూబే తలో వికెట్ తీసారు.

Fatal No-Ball Anshul Kamboj Costly Mistake After Tim David s 8-Six Storm Hands RCB Victory Over CSK

అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో 207 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సర్ఫరాజ్ ఖాన్(25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. ప్రశాంత్ వీర్(29 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 43) , జెమీ ఓవర్టన్(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) పోరాడారు. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీయగా.. జాకోబ్ డఫీ, కృనాల్ పాండ్యా, అభినందన సింగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. సుయాశ్ శర్మ‌కు ఒక వికెట్ దక్కింది.

కొంపముంచిన నోబాల్..

అన్షూల్ కంబోజ్ వేసిన నోబాల్ ఈ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. అతను వేసిన 18వ ఓవర్ ఐదో బంతికి డేంజరస్ టీమ్ డేవిడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ ఆ బంతి నో బాల్ కావడంతో అతను ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అప్పటికి అతను చేసింది 28 పరుగులే. కానీ ఈ అవకాశంతో టీమ్ డేవిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

ఏకంగా 8 భారీ సిక్సర్లతో మ్యాచ్‌ను పూర్తిగా లాగేసుకున్నాడు. మరుసటి ఫ్రీహిట్ డెలివరీనే సిక్సర్ బాదిన డేవిడ్.. జెమీ ఓవర్టన్ వేసిన 19వ ఓవర్‌లో నాలుగు సిక్స్‌లు, ఒక ఫోర్ బాది 30 పరుగులు పిండుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో 6, 4 బాది జట్టుకు 250 పరుగుల భారీ స్కోర్ అందించాడు. అన్షుల్ కంబోజ్ నో బాల్ వేయకుండా టీమ్ డేవిడ్ ఔటై ఉంటే ఈ మ్యాచ్ పరిస్థితి భిన్నంగా ఉండేది. ఆర్‌సీబీ 220 పరుగుల్లోపే పరిమితమయ్యేది. అప్పుడు సీఎస్‌కే లక్ష్య చేధన సులువు అయ్యేది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+