టీమిండియాకే ఛాన్స్, అది సరిదిద్దుకుంటేనే - క్రికెట్ దిగ్గజం అలర్ట్..!!

ప్రపంచ కప్ లో కీలక మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది. విశ్వ విజేతగా నిలిచేదెవరనేది ఇప్పుడు క్రికెట్ లెజెండ్స్ అంచనా వేస్తున్నారు. సెమీస్ లో భారత్ వర్సస్ న్యూజీలాండ్, ఆసీసీ వర్సస్ సౌతాఫ్రికా తల పడనున్నాయి. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లో విజయం సాధించిన భారత్ పైన అంచనాలు భారీగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ టీమీండియాకు కీలక సలహా ఇచ్చారు. ఎలా ముందుకు వెళ్లాలో సూచించారు.

ఫేవరెట్ టీం : సెమీస్ బెర్తు ఖాయం చేసుకున్న టీమిండియా పైన క్రికెట్ దిగ్గజాలు ఫేవరెట్ టీం గా చెబుున్నారు. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలిచే సత్తా టీమిండియాకు ఉందని వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ అన్నారు. ఆఖరి వరకు జైత్రయాత్ర కొనసాగిస్తూ టైటిల్‌ కైవసం చేసుకుంటుందని అభిప్రాయపడ్డాడు. ఇదే సమయంలో కొన్ని సూచనలు చేసారు. అయితే, ఈ ప్రయాణంలో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు దరిచేరనీయొద్దని రోహిత్‌ సేనకు సూచించారు. అలా అయితే మొదటికే మోసం వస్తుందని విండీస్‌ లెజెండరీ ఆల్‌రౌండర్‌ రిచర్డ్స్‌ హెచ్చరించారు.

Former cricketer Vivian Richards suggests unbeaten India to stay positive and attack at all costs ahead Semis

ఆ ఒక్కటి జాగ్రత్త : పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రోహిత్‌ సేన.. లీగ్‌ దశలో మిగిలిన ఒక్క మ్యాచ్‌లోనూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. భారీ విజయంతో అజేయంగా నిలవాలని పట్టుదలగా ఉంది. తొలి సెమీ ఫైనల్లో టీమిండియాతో తలపడేందుకు న్యూజిలాండ్‌ సిద్ధమైంది. అయితే, 2015, 2019 టోర్నీల్లో టీమిండియాకు న్యూజిలాండ్‌ చేతిలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా ఈసారి ఏం జరుగుతుందోననే ఆందోళన అభిమానులను వెంటాడుతోంది. ఈ క్రమంలో వివియన్‌ రిచర్డ్స్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Former cricketer Vivian Richards suggests unbeaten India to stay positive and attack at all costs ahead Semis

రిచర్డ్స్ సూచన : టీమిండియా చివరి దాకా అజేయంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. అయితే, కొన్నిసార్లు.. 'మేము ఇక్కడిదాకా బాగానే ఆడాం.. కానీ సెమీ ఫైనల్లో ఏం జరుగుతుందో' అనే భయాలు ఉండటం సహజమని రిచర్డ్స్ పేర్కొన్నారు. కానీ ఇలాంటి ప్రతికూల అంశాల గురించి ఎంత పక్కనపెడితే అంత మంచిదని సూచించారు. ఇప్పటిదాకా ఆత్మవిశ్వాసంతో ఎలా ఆడారో ఇక ముందు కూడా అలాగే ఆడాలని చెప్పుకొచ్చారు. వాళ్ల మైండ్‌సెట్‌లో ఎలాంటి మార్పూ రాకూడదని వివియన్‌ రిచర్డ్స్‌ పేర్కొన్నారు. నెగటివ్‌గా అనిపించే ప్రతి విషయాన్ని భారత ఆటగాళ్లు పక్కనపెట్టాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+