క్రికెట్ లవర్స్‌కు గ్రేట్ న్యూస్: ఐపీఎల్ టోర్నమెంట్?

IPL 2025: ఐపీఎల్.. క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఎంతోమంది మెరికల్లాంటి క్రికెటర్లను తయారు చేసిన ఘనత ఈ టోర్నమెంట్‌కు ఉంది. విదేశీ ప్లేయర్లను సైతం తీర్చిదిద్దింది. ఆధునిక క్రికెట్ రూపురేఖలను సమూలంగా మార్చివేసింది. క్రికెట్ అంటే ఇలాగే ఉండాలనే బ్రాండ్‌ను సృష్టించింది.

జస్‌ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, షాబాజ్ అహ్మద్, సాయి సుదర్శన్, వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్.. ఇలా జాతీయ జట్టు తరఫున ఆడుతున్న స్టార్ ప్లేయర్లందరికీ తొలి ప్లాట్‌ఫామ్ ఐపీఎల్ టోర్నమెంటే.

Former Indian cricketers have requested BCCI to start a IPL for retired players

అటు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు సైతం కోట్ల రూపాయల కనక వర్షాన్ని కురిపిస్తోందీ టోర్నమెంట్. దేశ జీడీపీనీ నిర్దేశించే స్థాయికి ఎదిగింది. 2023లో ఐపీఎల్ ద్వారా వచ్చిన జీడీపీ వాటా 11.2 బిలియన్ డాలర్లంటే.. దానికి ఉన్న డిమాండ్ ఏ పాటిదో అర్థం చేేసుకోవచ్చు. దీనికి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మహిళల ఐపీఎల్ సైతం తెర మీదికి వచ్చింది.

ఇప్పుడు మరో ఐపీఎల్ టోర్నమెంటో కోసం బీసీీసీఐ త్వరలోనే కసరత్తు మొదలుపెట్టే అవకాశాలు లేకపోలేదు. తమ కోసం ప్రత్యేకంగా ఐపీఎల్‌ టోర్నమెంట్‌ను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలంటూ పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు బీసీసీఐ కార్యదర్శి జై షాకు విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్, గ్లోబల్ లెజెండ్స్ లీగ్, లెజెండ్స్ లీగ్ క్రికెట్.. తరహాలోనే లెజెండ్స్ ఐపీఎల్‌ ఫార్మట్‌ను రూపొందించాలని కోరారు. సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, ముత్తయ్య మురళీధరన్ వంటి ప్లేయర్లు ఈ మేరకు జై షాకు సూచించారు.

ఇటీవలే యువరాజ్ సింగ్ నేతృత్వంలోని భారత మాజీ క్రికెటర్ల టీమ్.. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్ ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్‌కు మంచి ఆదరణ లభించింది. దీన్ని మరింత విస్తరించడంలో భాగంగా ఐపీఎల్ టోర్నమెంట్‌ను రూపొందించాలని కోరారు.

దీనిపై బీసీసీఐ సానుకూలంగా స్పందించగలిగితే- లెజెండరీ ప్లేయర్ల గేమ్‌ను మనం చూడొచ్చు. ముత్తయ్య మురళీధరన్, సనత్ జయసూర్య, క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, ఏబీ డివిలియర్స్ వంటి మాజీ అంతర్జాతీయ క్రికెటర్లు మళ్లీ గ్రౌండ్‌లో మెరుపులు మెరిపించడం ఖాయమౌతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+