టీమిండియా లెజెండ్.. బెంగళూరు మెట్రో రైల్ లో ఓ సాదాసీదా ప్రయాణికుడిలా

బెంగళూరు నమ్మ మెట్రోలో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్ ఓ సాదాసీదా ప్రయాణికుడిలా ట్రావెల్ చేశారు. లేత నీలం రంగు షర్ట్, ముదురు బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించ, చేతిలో ఓ చిన్న ట్రాలీ బ్యాగ్ తో చూడ్డానికి ఓ ఐటీ ఎంప్లాయ్ గా దర్శనం ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ రెండు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఆయన సింప్లిసిటిని నెటిజన్లు మెచ్చుకుంటోన్నారు. ప్రశంసలు కురిపిస్తోన్నారు.

ఆయన మరెవరో కాదు.. ఒకప్పుడు ప్రత్యర్థి బ్యాటర్ల గుండెల్లో వణుకు పుట్టించిన భారత మాజీ పేసర్.. జవగళ్ శ్రీనాథ్. 1990 దశకంలో టీమిండియా పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ను ఒంటిచేత్తో నడిపించాడు. తన కేరీర్ లో 67 టెస్టులు, 229 వన్డే మ్యాచ్‌లకు ప్రాతినిథ్యాన్ని వహించాడీ మైసూర్ ఎక్స్‌ప్రెస్. వన్డేల్లో 315, టెస్టుల్లో 236 వికెట్లు కూల్చాడు. జవగళ్ శ్రీనాథ్ స్థాయిలో ఉన్న ఏ ఇతర క్రికెటర్ అయినా చుట్టూ బౌన్సర్లతో సెక్యూరిటీని అరెంజ్ చేసుకుంటుంటారు.

Former Team India Star Player Looks Like Any Other Commuter in Namma Metro Bengaluru Wins Hearts

దీనికి భిన్నంగా ఆయన ఓ సాధారణ పౌరుడిలా మెట్రో రైల్ లో ప్రయాణించడం అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఈ చిత్రాన్ని చూసిన క్రీడాభిమానులు శ్రీనాథ్ వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సెలబ్రిటీ హోదా తలకెక్కించుకోకుండా నిరాడంబరంగా జీవించడం ఆయన గొప్పదనానికి నిదర్శనమని పేర్కొంటున్నారు. గతంలో కూడా ఆయన మైసూర్ రైల్వే స్టేషన్‌లో బ్యాక్ ప్యాక్ తో సాధారణ ప్రయాణికుడిలా కనిపించారు.

కర్ణాటకకే చెందిన ఇతర వెటరన్ క్రికెటర్లు.. అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, వెంకటేష్ ప్రసాద్ వంటి దిగ్గజాలు గ్రౌండ్ లో ఎన్ని అద్భుతాలు సృష్టించినా, వ్యక్తిగత జీవితంలో ఆర్భాటాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. వారికి లభించిన కీర్తి ప్రతిష్టలు శిఖర సమానమైనప్పటికీ.. సాధారణ జీవితాన్ని గడపడానికే ఇష్టపడతారు. జవగళ్ శ్రీనాథ్ క్రికెట్ తో తన అనుబంధాన్ని తెంచుకోలేదు. ఐసీసీ అంతర్జాతీయ మ్యాచ్ లకు రిఫరీగా వ్యవహరిస్తోన్నారు.

రోహిత్, శుభ్‌మన్ గిల్ ను దాటేసిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్: ఆ రికార్డులు అవుట్
రోహిత్, శుభ్‌మన్ గిల్ ను దాటేసిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్: ఆ రికార్డులు అవుట్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+